Gladiator 2 : గ్లాడియేటర్ ను మ్యాచ్ చేసే సత్తా ఉందా..

Gladiator 2 :  గ్లాడియేటర్ ను మ్యాచ్ చేసే సత్తా ఉందా..
X

గ్లాడియేటర్.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీస్ లోస్పెషల్ ప్లేస్ ఉన్న సినిమా. హాలీవుడ్ లోనే రూపొందినా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి కోటాను కోట్ల అభిమానులున్నారు. ఆ స్థాయి కంటెంట్ తో పాటు యాక్షన్ కూడా మిళితమైన సినిమా ఇది. రిడ్లే స్కాట్ డైరెక్షన్ రస్సెల్ క్రో హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కల్ట్ మూవీస్ లిస్ట్ లో చూస్తారు ఫ్యాన్స్. రోమన్ చక్రవర్తుల వల్లు కుటుంబాన్ని కోల్పోయి బానిసలా మారి.. తర్వాత ఆ బానిసత్వంలో నుంచే చక్రవర్తిని అంతం చేసే యోధుడుగా రస్సెల్ క్రో నటనకు జనం జేజేలు పలికారు. 103 మిలియన్ డాలర్స్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 465 మిలియన్ కు పైగా వసూలు చేసిందంటే.. గ్లాడియేటర్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. ఓ క్లాసిక్ సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు చాలా ఉంటాయి. వాటిని అందుకుంటారో లేదో కానీ.. తాజాగా గ్లాడియేటర్ 2 ట్రైలర్ విడుదలైంది.

గ్లాడియేటర్ 2లో ఫస్ట్ పార్ట్ లోని మాక్సిమస్ తనయుడు హీరోగా, కమోడస్ తనయుడు విలన్ గా కనిపిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్ పార్ట్ టెంప్లేట్ ను దాదాపుగా ఫాలో అయ్యారు అనిపిస్తోంది. అలాగే మొదటి భాగంలో మాక్సిమస్ కు ఫ్రెండ్ గా ఉన్న వ్యక్తి ఇక్కడ అతని కొడుకుకి సాయం చేయడం హైలెట్ గా కనిపిస్తోంది. ట్రైలర్ ఆకట్టుకునేలానే ఉంది. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. తాజా ట్రైలర్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి మాస్టర్ పీస్ లాంటి గ్లాడియేటర్ కుస సీక్వెల్ గా వస్తోన్న ఈ గ్లాడియేటర్ 2 నవంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Tags

Next Story