Mr Bachchan OTT date : మిస్టర్ వచ్చన్ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చెన్
మాస్ మహరాజా రవితేజ రీసెంట్ డిజాస్టర్ మూవీ మిస్టర్ బచ్చన్. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. రిలీజ్ కు ముందు ఓ రేంజ్ లో హైప్ చేశారు. ముఖ్యంగా హరీశ్ శంకర్ చేసిన హడావిడీ చూస్తే ఇది మరో గబ్బర్ సింగ్ అవుతుందని భావించారు చాలామంది. బట్ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా తేలింది బచ్చన్. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రైడ్ కు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఆ ఒరిజినల్ లోని ఇంటెన్సిటీని టెన్ పర్సెంట్ కూడా అందుకోలేకపోయింది. కామెడీ పేరుతో చేసిన రచ్చకు ఆడియన్స్ బలైపోయారు. దీనికి తోడు హీరోయిన్ తో రవితేజ వేసిన స్టెప్పులు, పాటల్లోని విన్యాసాలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. వెరసి రవితేజకు ఇది మరో బిగ్ డిజాస్టర్ గా మిగిలింది.
ఇక థియేటర్స్ లో ఎలా ఉన్నా.. అంతకు ముందే ఓటిటి బిజినెస్ అయిపోతుంది కాబట్టి.. ఇక్కడా రిలీజ్ కావాల్సిందే కదా. అందుకే ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది. మిస్టర్ బచ్చన్ ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ తీసుకుంది. ఈ నెల 12 నుంచి ఈ మూవీ అన్ని భాషల్లో స్ట్రీమ్ కాబోతోంది. రవితేజ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను కూడా చిరాకు పెట్టిన ఈ మూవీ ఓటిటిలో ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com