Nani : అప్పుడే ఓటిటిలోకి సరిపోదా శనివారం

Nani :   అప్పుడే ఓటిటిలోకి సరిపోదా శనివారం
X

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా సరిపోదా శనివారం. ప్రియాంకమోహన్ హీరోయిన్. ఎస్.జే సూర్య విలన్ గా నటించాడు. అంటే సుందరానికి తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని నటించిన సినిమా ఇది. మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినా వంద కోట్లు వచ్చాయని ఈ మధ్యే పోస్టర్ కూడా వేసుకున్నారు మేకర్స్. నిజానికి చాలా వీక్ కంటెంట్, నెరేషన్ తో కనిపిస్తుందీ మూవీ. కాకపోతే జేక్స్ బెజోయ్ ఆర్ఆర్ తో అదరగొట్టాడు. అది సినిమాకు చాలా పెద్ద ఎసెట్ అయిందనేది నిజం. ప్యాన్ ఇండియా సినిమా అని హడావిడీ చేసినా.. తమిళ్ లో సూర్య, ప్రియాంక తెలిసినవాళ్లే అయినా.. ఇక్కడ తప్ప ఇంకెక్కడా సౌండ్ చేయలేదీ శనివారం మూవీ.

యాక్షన్ సన్నివేశాల్లో నాని అస్సలు సెట్ కాలేదు. పూర్తిగా తేలిపోయాడు అనే కమెంట్స్ కూడా వచ్చాయి. అవన్నీ ఎలా ఉన్నా.. రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా కాకుండానే అప్పుడే ఓటిటిలోకి వదిలేస్తున్నారీ మూవీని. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 26 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా అదే రోజు నుంచి స్ట్రీమ్ అవుతుంది. మరి ఓటిటిలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో ఈ మూవీ.

Tags

Next Story