Suriya's Kanguva : సూర్య కంగువ కొత్త రిలీజ్ డేట్ ఇదే

Suriyas Kanguva :  సూర్య కంగువ కొత్త రిలీజ్ డేట్ ఇదే
X

తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన ప్యాన్ ఇండియా మూవీ కంగువ. శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాబీ డియోల్ విలన్ గా, దిశా పటానీ హీరోయిన్ గా నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదల చేస్తాం అని అనౌన్స్ చేశారు. బట్ అదే డేట్ కు రజినీకాంత్ వేట్టైయాన్ కూడా ఉండటంతో కంగువను పోస్ట్ పోన్ చేశారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ తర్వాత అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. వాటిని రీచ్ కావాలంటే ప్రాపర్ ప్రమోషన్ కూడా కావాలి. ఇది సూర్యకు ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. అతని కెరీర్ లోనే హయ్యొస్ట్ బడ్జెట్ తో రూపొందుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ ఆర్ఆర్ హైలెట్ గా నిలవబోతోందని ట్రైలర్ తో అర్థం అయింది. ఓ కొత్త బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా అని చెబుతున్నారు. శివ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ రెగ్యులర్ కమర్షియల్ ప్యాట్రన్లో ఉన్నాయి. ఫస్ట్ టైమ్ అతనూ ఓ కొత్త జానర్ ట్రై చేశాడని ఈ మూవీ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

ఎలా చూసినా కోలీవుడ్ నుంచి మోస్ట్ అవెయిటెడ్ మూవీ అనిపించుకున్న కంగువ కొత్త రిలీజ్ డేట్ కోసం ఎంటైర్ ఫ్యాన్స్ ఈగర్ గా చూస్తున్నారు. ఇటు తెలుగులోనూ సూర్యకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి మన ఆడియన్స్ కూడా కంగువ రిలీజ్ డేట్ ఎప్పుడా అని సెర్చ్ లు చేస్తున్నారు. ఫైనల్ గా రిలీజ్ డేట్ అనౌన్స చేశారు మేకర్స్. అంతా ఊహించినట్టుగానే నవంబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. నవంబర్ 14న గురువారం పబ్లిక్ హాలిడే. లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది కాబట్టి మంచి రికార్డులు కొల్లగొట్టే అవకావం ఉందని చెప్పొచ్చు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 38 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇందులో 3డి, ఐమాక్స్ ఫార్మాట్స్ కూడా ఉన్నాయి.

Tags

Next Story