Pushpa 2 OTT : పుష్ప 2 ఓటిటికి వచ్చేది ఎప్పుడంటే

అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండియాలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ లాగానే తెలుగులో పెద్దగా పర్ఫార్మ్ చేయకపోయినా నార్త్ లో దుమ్మురేపింది. నాన్ దంగల్ రికార్డ్ కు అతి చేరువలో ఉంది. ఇకపై తెలుగు నుంచి ఎవరైనా పెద్ద రికార్డ్ ల గురించి చెప్పాలంటే నాన్ పుష్ప 2 అని రాసుకునేలా చరిత్ర సృష్టింది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్.. రష్మిక మందన్న పాత్రను డిజైన్ చేసిన విధానం ఇవన్నీ సినిమాకు బిగ్ ఎసెట్ గా నిలిచాయి. ఇప్పటికే 1800 కోట్ల కలెక్షన్స్ మార్క్ ను సాధించింది పుష్ప 2. మరో 12 కోట్లు కొల్లగొడితే బాహుబలి 2 ఆల్ టైమ్ కలెక్షన్స్ రికార్డ్ బద్ధలైపోతుంది.
ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటిటిలో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తెలుగు స్టేట్స్ లో విపరీతమైన టికెట్ ధరల కారణంగా చాలమంది థియేటర్స్ లో చూడలేదీ చిత్రాన్ని. అందుకే ఓటిటి డేట్ ఎప్పుడా అని సెర్చ్ చేస్తున్నారు. పుష్ప 2 ఓటిటి రైట్స్ ను రికార్డ్ స్థాయిలో 250 కోట్లకు తీసుకుంద నెట్ ఫ్లిక్స్. ఇది అన్ని భాషలకూ కలిపి. ఇప్పటి వరకూ ఇండియా నుంచి ఇప్పటి వరకూ ఏ చిత్రానికీ ఇంత భారీ ధర లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక నెట్ ఫ్లిక్స్ రూల్స్ ప్రకారం థియేటర్స్ లో విడుదలైన 56 రోజుల తరవాతే ఓటిటిలో స్ట్రీమ్ చేయాలి. అలా చూస్తే ఈ నెలాఖరు వరకూ 56 డేస్ అయిపోతుంది. సో.. జనవరి ఆఖరు నుంచి పుష్ప 2 ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com