Ram Pothineni : ఆంధ్రాకింగ్ తాలూకా కుర్రోడు వచ్చేశాడు

Ram Pothineni :  ఆంధ్రాకింగ్ తాలూకా కుర్రోడు వచ్చేశాడు
X

రామ్ పోతినేని, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాకు అంతా ఊహించినట్టుగానే ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇవాళ(గురువారం) రామ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇంతకు ముందు మహేష్ బాబు డైరెక్ట్ చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మంచి ఎంటర్టైనర్ అనిపించుకుంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే మరోసారి మంచి ఎంటర్టైనర్ తో వస్తున్నారు అనిపిస్తోంది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వివేక్ - మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ గ్లింప్స్ చూస్తుంటే వింటేజ్ ఫీల్ ను తెచ్చే మూవీలా కనిపిస్తోంది. ఒకప్పుడు టికెట్స్ కోసం బుకింగ్స్ వద్ద బారులు తీరేవారు. కొట్టుకోవడం.. తిట్టుకోవడం.. ఒకరిపై ఒకరు ఎక్కి వెళ్లడం.. తీరా బుకింగ్ వద్దకు వెళ్లేసరికి ‘హౌస్ ఫుల్’బోర్డ్ పెట్టేయడం.. ఇలా కొందరు మాత్రం తీరిగ్గా.. ఆళ్ల తాలూకా ఈళ్ల తాలూకా అని చెప్పి ముందే టికెట్స్ ను రిజర్వ్ చేసుకోవడం.. మేనేజర్స్ కు అదో తలనొప్పిగా మారిపోవడం.. ఇవన్నీ కనిపిస్తున్నాయీ గ్లింప్స్ లో. సో.. ఇది ఈ కాలం నాటి కథ కాదు అని అర్థం చేసుకోవచ్చు. 1990స్ లేదా అంతకు ముందే జరిగే కథ అనుకోవచ్చు.

ఇక ఈ మూవీలో ఆంధ్రాకింగ్ అనే బిరుదు ఉన్న హీరోగా ఉపేంద్ర నటిస్తున్నాడని ఆల్రెడీ చెప్పేశారు. అతనికి వీరాభిమానిగా రామ్ కనిపించబోతున్నాడు. మరి ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలు ఉంటాయా లేక కేవలం ఆ హీరోను అలా పెట్టేసి మిగతా ట్రాక్ నడిపిస్తారా అనేది తెలియదు కానీ.. చాలా రోజుల తర్వాత రామ్ మూవీకి గ్లింప్స్ తోనే కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మరి ఈ మూవీతో అయినా ఓ బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి.

Tags

Next Story