Samantha : సమంత సిటాడెల్ ఎలా ఉంది..?

Samantha :  సమంత సిటాడెల్  ఎలా ఉంది..?
X

మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. మయోసైటిస్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శామ్.. ఈ సారి వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇంతకు ముందు తను చేసిన ద ఫ్యామిలీ మేన్ 2 వెట్ సిరీస్ డైరెక్టర్స్ అయిన రాజ్ డికే ద్వయమే ఈ సిరీస్ ను రూపొందించారు. నవంబర్ 7న ప్రైమ్ వీడియోస్ లోవిడుదల కాబోతోన్న ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఇండియన్ వెర్షన్ ట్రైలర్ విడుదలైంది.

సిటాడెల్ హాలీవుడ్ నుంచి రూపొందే టివి షో. ఆ షోకు ఇండియన్ వెర్షన్ గా ఇది రూపొందింది. కొన్నాళ్ల క్రితం వచ్చిన టీజర్ చూస్తే అంతగా అనిపించలేదు. బట్ ఈ ట్రైలర్ మాత్రం ఆకట్టుకుంటోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కంటెంట్ తో కనిపిస్తోందీ ట్రైలర్. సమంతతో పాటు బాలీవుడ్ యంగ్ స్టర్ వరుణ్ ధావన్ మరో మెయిన్ లీడ్ లో కనిపిస్తున్నాడు. కేకే మీనన్ విలన్. వరుణ్, శామ్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ గా కనిపిస్తున్నారు. శామ్ కు ఓ కూతురు కూడా ఉంది. మరి తన భర్త ఏమయ్యాడు.. వరుణ్ తో తన రిలేషన్ ఎలా ఉంటుంది అనేది సిరీస్ లోనే చూడాలి. అయితే ఈ ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తోనే ఎక్కువగా నింపేశారు. అందులో శామ్ చాలా ఎక్స్ పర్ట్ లా కనిపిస్తోంది. తన ఫిజిక్, బాడీ కూడా మార్షల్ ఆర్ట్స్ తెలిసిన మనిషిలా ఉంది. అంత పర్ఫెక్ట్ గా తను ఈ పాత్రను ఓన్ చేసుకున్నట్టుంది.

హాలీవుడ్ లో కాస్త ఘాటైన సన్నివేశాలు కూడా ఉంటాయి. బట్ ఈ ట్రైలర్ లో అలాంటివి మచ్చుకు కూడా లేవు. అంటే కంప్లీట్ గా ఇండియనైజ్ చేశారు అనుకోవచ్చు. అలాగే సమంత కూడా ఈ తరహా సీన్స్ కు ఇకపై నో అనే సంకేతం ఇస్తున్నట్టుగానూ భావించవచ్చు. మొత్తంగా సిటాడెల్ కోసం సమంత ఫ్యాన్స్ తో పాటు చాలామంది ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ తో తను మళ్లీ ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మరికొన్నాళ్ల పాటు బిజీఅవుతుందనడంలో డౌటే లేదు.

Tags

Next Story