Telusu Kada : మీకు తెలుసా.. ‘తెలుసు కదా’ఎప్పుడు రిలీజ్ అవుతుందో..

Telusu Kada :  మీకు తెలుసా.. ‘తెలుసు కదా’ఎప్పుడు రిలీజ్ అవుతుందో..
X

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తోన్న మూవీ ‘తెలుసు కదా’. కాస్ట్యూమ్ డిజైనర్ గా స్టార్స్ తో పనిచేసిన నీరజా కోన ఈచిత్రంతో దర్శకురాలుగా పరిచయం అవుతోంది. ఈ మూవీకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటం విశేషం. సిద్ధు లాస్ట్ మూవీ జాక్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. దీంతో ఈ మూవీతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. ఇద్దరు హీరోయిన్లు... ముందు నుంచీ ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉండటం.. తెలుసు కదాకు ప్లస్ అవుతుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది టీమ్. ఇందుకోసం వీరు చేసి ఒక వీడియో ఇన్నోవేటివ్ గా ఉంటూ చూడగానే ఆకట్టుకుంటోంది.

సిద్ధు తన ఫోన్ లో ఏదో గేమ్ ఆడుకుంటుండగా.. శ్రీనిధి శెట్టి నుంచి వీడియో కాల్ వస్తుంది. ఏంటీ వీడియో కాల్ చేశావు అంటే నిన్ను చూడాలనిపించింది అంటుంది తను. అలా మాట్లాడుతుండగానే మరోవైపు రాశిఖన్నా కూడా వీడియో కాల్ చేస్తుంది. ఆ కాల్ అటెండ్ చేయడానికి ‘ఆఫీస్ కాల్’అని చెప్పి శ్రీనిధి ఫోన్ కట్ చేసి రాశితో మాట్లాడుతుంటాడు. అంతకు ముందు రాశిఖన్నాకు కాల్ కాల్ వెయిటింగ్ వస్తుంది.. ఇప్పుడు శ్రీనిధికికాల్ వెయిటింగ్ వస్తుంది. దీంతో రాశిఖన్నా వీడియో ఓపెన్ చేస్తే ముగ్గురూ ఫ్రేమ్ లో ఉంటారు. అంతే సిద్ధును అలా ఉంచి ఇద్దరూ గొడవ పడుతుంటారు.అప్పుడు అతను ఇద్దరినీ వారించి.. ‘తెలుసు కదా లవ్ యూ టు’అంటూ రెండు నంబర్ చూపిస్తాడు. అంటే ఇద్దరినీ ప్రేమిస్తున్నాడని.. ఆ తర్వాత ‘మీకు తెలుసా.. తెలుస్తుందిలే.. అక్టోబర్ 17న’ అంటాడు. సో.. అదే సినిమా రిలీజ్ డేట్ అన్నమాట. పైగా అది దీపావళి కూడా. సో.. ఈ దీపావళికి సిద్ధు, రాశిఖన్నా, శ్రీనిధిల పంచాయితీ ఏంటో అందరికీ తెలిసిపోతుందన్నమాట.

Tags

Next Story