Sudheer Babu : నాకు ఒక్కడే నాన్న.. ఆయన సూపర్ హీరో

Sudheer Babu :  నాకు ఒక్కడే నాన్న.. ఆయన సూపర్ హీరో

సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా మా నాన్న సూపర్ హీరో. కెరీర్ మొత్తంలో ప్రతి సారీ కొత్తగా ఏదో ఒకటి ప్రయత్నిస్తూనే ఉన్నాడు సుధీర్. మాస్, క్లాస్ ను మెప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలో ఇప్పుడు చాలా సెన్సిబుల్ గా కనిపిస్తోన్న ‘ మా నాన్న సూపర్ హీరో’ అనే మూవీతో వస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఓ రకంగా తండ్రి కొడుకుల నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి కానీ ఇది కొత్తగా కనిపిస్తోంది. హీరోకు తండ్రి ఒక్కడే కానీ.. ఇద్దరు కనిపిస్తున్నారు. ఆ ఇద్దరిలో అసలు తండ్రి ఎవరు అనేది తెలియకుండా టీజర్ చాలా బాగా కట్ చేశారు. మేకింగ్ పరంగా చాలా బావుంది. బ్యూటీఫుల్ యాంబియన్స్ కనిపిస్తోంది.

‘నేను సంపాయిస్తున్న కదా నాన్నా.. ఇంకెందుకు నువ్వు డబ్బుల కోసం ఏదో ఒకటి చేయడం.. గొడవలు పడటం.. మానేయొచ్చు కదా.. ’ అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన టీజర్ ప్రతి ఫ్రేమ్ లోనూ ప్లెజెంట్ గానే కనిపిస్తోంది. ఆఖరికి కొడుకుతో ఫోటో దిగడానికి కూడా ఇష్టపడని తండ్రి అనే షాట్ కూడా బావుంది. ‘అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడుక్కున్నట్టు కాదు.. నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టూ కాదు..’ అనే డైలాగ్ టీజర్ కే హైలెట్ అనేలా ఉంది. ఇక చివర్లో తన కొడుక్కి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అని తండ్రి అప్పు చేశాడని తెలుసుకుని.. దాన్నీ కవర్ చేస్తూ.. ‘నాన్నకు తెలియదు బాబాయ్.. నిజానికి నాకు క్యాన్సర్ సెకండ్ స్టేజ్.. ’ అంటాడు సుధీర్. ఈ డైలాగ్ ను బట్టి టైటిల్ కు జస్టిఫికేషన్ ఎలా ఇస్తారా అనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అంటే తండ్రి కోసం తనూ తనకు క్యాన్సర్ అని అబద్ధం చెప్పేస్తాడు అంటే అతని దృష్టిలో తండ్రి ఎంత సూపర్ హీరోనో అర్థం కావడం లేదూ..?

సుధీర్ సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో తండ్రి పాత్రల్లో సాయి చంద్ తో పాటు షాయాజీ షిండే కనిపిస్తున్నారు. ఇంతకు ముందు లూజర్ అనే వెబ్ సిరీస్ తో బాగా ఆకట్టుకున్న అభిలాష్ కంకర డైరెక్ట్ చేసిన సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ వాళ్లు నిర్మించారు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 11న విడుదల కాబోతోంది ఈ మూవీ. సో.. ఈ దసరాకు సుధీర్ థియేటర్స్ లో సెంటిమెంట్ కురిపించబోతున్నాడన్నమాట.

Tags

Next Story