Suriya's RETRO : సూర్య టైటిల్ టీజర్ అదిరిపోయింది

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన కంగువాతో ప్యాన్ ఇండియ స్థాయిలో మార్కెట్ క్రియేట్ అవుతుందనుకున్నారు. బట్ ఆ మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చింది. నిజానికి టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ప్రమోషన్స్ చేసింది. ఓ పేద్ద హిట్ కొట్టబోతున్నాం అనే నమ్మకం వారిలో కనిపించింది. కానీ జనాలకు సినిమా నచ్చలేదు. అయినా సూర్య బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతున్నాడిప్పుడు. వీటిలో భాగంగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ తో ఓ మూవీ స్టార్ట్ అయింది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ టైటిల్ రివీల్ చేస్తూ ఓ టీజర్ విడుదల చేశారు. ఇది మాత్రం సూపర్బ్ అనేలా ఉంది.
లోకేష్ కనకరాజ్ క్రియేట్ చేసిన ఈ టైటిల్ టీజర్స్ ట్రెండ్ ప్రతిసారీ క్లిక్ అవుతోంది. అలా సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రానికి ‘రెట్రో’అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టీజర్ చూస్తే.. ఓ గుడి.. దాని ముందు కోనేటి మెట్లపై కూర్చున్న సూర్య.. పూజాహెగ్డే. పూజా అతని చేతికి ఏదో తాయొత్తు లాంటిది కడుతుంది. ఆమెను చూస్తూ.. ‘ కోపం తగ్గించుకుంటాను. మా నాన్నతో కలిసి పనికి వెళతాను. హింస, రౌడీయిజం, గూండాయిజం అన్నిటినీ వదిలేస్తాను. నవ్వుతూ బ్రతకడం నేర్చుకుంటాను. నేను పుట్టిన దానికి కారణం.. నీ భాషలో చెబితే దమ్మం.. ప్రేమ.. పరిశుద్ధ ప్రేమ. అది మాత్రమే. ఇప్పుడు నువ్వు చెప్పు.. పెళ్లి చేసుకుందామా..’ అంటాడు సూర్య. దానికి తను అతని నుదురుపై ముద్దుపెట్టి తన సమ్మతం తెలియజేస్తుంది.
ఈ టీజర్ లో హైలెట్ ఏంటీ అంటే.. అతను కోపం తగ్గించుకుంటాను, రౌడీయిజం మానేస్తాను, నవ్వడం నేర్చుకుంటాను అన్నప్పుడు బ్యాక్ ఎండ్ విజువల్స్. సూర్య చాలా ఎగ్రిసివ్ గా కనిపించడం. అతని కోసం చాలామంది విలన్స్ కాచుకుని ఉండటం. తను రౌడీయిజం చేస్తున్నప్పుడే ఒకానొకసారి పూజాను చూసి ప్రేమలో పడటం.. ఈ సెటప్ అంతా అద్దిరిపోయింది. దీనికి సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం ఆ రెట్రో మ్యాజిక్ ను రిపీట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
మొత్తంగా సూర్య ట్రెండ్ మార్చాడు. ప్యాన్ ఇండియా అని కాకుండా ఓ మంచి కథతో వస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ 2025 సమ్మర్ లో విడుదల కాబోతోన్న రెట్రోతో అతను బ్లాక్ బస్టర్ కొట్టేలానే ఉన్నాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com