Thalapathi Vijay : విజయ్ గోట్ కథ చాలా పెద్దదే
తమిళ్ టాప్ స్టార్ దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘గోట్’. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. కొన్నాళ్లుగా విజయ్ తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అందుకే అతని సినిమాలు ఇక్కడా గ్రాండ్ గానే రిలీజ్ అవుతున్నాయి. తమిళనాడులో విజయ్ నటించిన సినిమా యావరేజ్ అయినా అది బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే అతను రీసెంట్ గా పొలిటికల్ పార్టీ స్థాపించాడు.పూర్తిగా పార్టీకే అంకింతం కావాలనుకుంటున్నాడు. అందుకే గోట్ తర్వాత మరో మూవీ చేసి ఆపై సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు. ఈ విషయం ఆల్రెడీ చెప్పాడు. అందుకే గోట్ మూవీపై భారీ అంచనాలున్నాయి.
రీసెంట్ గా విడుదలైన గోట్ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ ఫ్యాన్స్ కు మరింత బాగా నచ్చేలా కనిపిస్తోందీ మూవీ. పైగా విజయ్ కి బాగా కలిసొచ్చే డ్యూయొల్ రోల్ కూడా చేశాడు. ప్రశాంత్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి రూపంలో కలర్ ఫుల్ గానూ కనిపిస్తోంది. అయితే ఈ సినిమా నిడివి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరో అయినా స్మాల్ హీరో అయినా మరీ ఎక్కువ లెంగ్త్ ఉన్న మూవీస్ అయితే ఆడియన్స్ భరించలేకపోతున్నారు. మరీ అవుట్ స్టాండింగ్ కంటెంట్ అయితే తప్ప ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం లేదు. కంప్లీట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోన్న గోట్ మూవీ నిడివి మూడు గంటలట. యస్.. 2.59 నిమిషాలు. అంటే మూడు గంటలకు ఒక్క నిమిషమే తక్కువ. మరి మాస్ మూవీస్ ఇంత లెంగ్త్ ఉంటే భరిస్తారా అనేది పెద్ద ప్రశ్నే. పైగా దర్శకుడు వెంకట్ ప్రభు చివరి చిత్రం కస్టడీ ఫ్లాప్ అయింది. అందుకే తెలుగు వరకూ ఏ మాత్రం తేడా కొట్టినా ఇమ్మీడియొట్ గా నెగెటివ్ టాక్ వచ్చేస్తుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com