Mechanic Rocky : మెకానిక్ రాకీ ట్రైలర్ డేట్ పై డౌట్స్

Mechanic Rocky : మెకానిక్ రాకీ ట్రైలర్ డేట్ పై డౌట్స్
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. అన్నీ కుదిరితే ఈ నెల 31న విడుదల కావాల్సిన సినిమా ఇది. బట్ అవుట్ పుట్ పై డౌట్ రావడంతో కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేయాల్సి వచ్చిందట. ఈ కారణంగానే లేట్ అయింది. కొత్త రిలీజ్ డేట్ కూడా నవంబర్ 22న అని అనౌన్స్ చేశారు గతంలోనే. సరిపోదా శనివారం మూవీని కేవలం తన బిజీఎమ్ తోనే నిలబెట్టిన జేక్స్ బెజోయ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్.

ఆ మధ్య విడుదల చేసిన మెకానిక్ రాకీ టీజర్ ఆకట్టుకుంది. ఇక త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల కాబోతోంది. ఈ నెల 20న 3 గంటల నుంచి హైదరాబాద్ లోని శ్రీ రాములు థియేటర్ లో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ఉండబోతోందని అఫీషియల్ గా ప్రకటించింది మూవీ టీమ్. అయితే రిలీజ్ కు నెల రోజుల ముందే ట్రైలర్ విడుదల చేయబోతుండటంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రమోషన్స్ పరంగా కొత్తగా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా... లేక ట్రైలర్ కు వచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టి ఇంకేవైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారా అనుకుంటున్నారు. అసలే రీ షూట్స్ కు వెళ్లిన సినిమాలపై అనుమానాలు ఎక్కువ. వీటికి తోడు ఇలాంటి డౌట్స్ కూడా వచ్చి.. సినిమా రిలీజ్ అయ్యి రిజల్ట్ తేడా కొడితే.. మెకానిక్ రాకీని ఆడియన్స్ కూడా డ్యామేజ్ చేస్తారు.



Tags

Next Story