Viswak Sen : మెకానిక్ రాకీ ట్రైలర్..ఆడియన్స్ ను ఎర్రెక్కిస్తారా..?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా ‘మెకానిక్ రాకీ’. శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. నవంబర్ 22న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో మొదలైన ట్రైలర్ మాస్ టర్న్ తీసుకుని యాక్షన్ మోడ్ లోకి వెళ్లి.. అక్కడక్కడా బీప్ డైలాగ్స్ తో మాస్ ఆడియన్స్ టార్గెట్ గా కనిపిస్తోంది.
కంప్యూటర్ సైన్స్ చదివి సివిల్ సింజినీర్ అయిపోతా అన్న కొడుకు తెలివితేటలు చూసిన తండ్రి అతనితో ఓ మెకానిక్ షెడ్ ఓపెన్ చేయిస్తాడు. అక్కడ బండ్లు రిపేర్ చేస్తూనే.. అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పుతూ ఉంటాడు హీరో. ఈక్రమంలో ఒక హీరోయిన్ అతన్ని ప్రేమిస్తే.. మరో హీరోయిన్ ను ఇతను ప్రేమిస్తాడు. మరి ఈ ప్రేమకథల్లో ఎవరికి సెట్ అయిందో కానీ.. సునిల్ రూపంలో విలన్ ఎంట్రీ. అదీ తన షెడ్ పైకి రావడం.. తండ్రిని ఇన్సల్ట్ చేయడం.. ఇదంతా రొటీనే కానీ.. కొంచెం కొత్తగా చూపించబోతున్నారు అనే కలరింగ్ అయితే కనిపిస్తుంది. ట్రైలర్ లో అయితే అబ్బా భలే ఉందే అనిపించేంత కొత్తదనం మచ్చుకు కూడా లేదు. మాస్ మూవీ అంటే ఇట్లనే ఉంటది అన్నట్టుగా అన్నీ ఒక మీటర్ లో రూపొందించారా అన్నట్టు కనిపిస్తోంది. అయినా కాస్త ఎంటర్టైనింగ్ గానే ఉంది. అంటే సినిమా చూస్తున్నంత సేపూ బోర్ కొట్టకుండా ఉంటే పాత ఫార్మాట్ అయినా ఒకే మీటర్ లో ఉన్నా ఇబ్బంది ఉండదు. మొత్తంగా మెకానిక్ కాబట్టి బూతులు వాడాల్సిందే అన్నట్టుగా పెట్టారా లేక వాంటెడ్ గా ట్రెండ్ లో పెట్టేశారా అన్నది తెలియదు కానీ.. పంటి కింద రాయిలా ఉన్నా విశ్వక్ సేన్ కు ఓకే అయిపోతుందనిపించేలా కొన్ని ఎర్రి పూ.. .. ఆడియన్స్ ఎర్రెక్కించే ప్రయత్నం చేసినట్టుంది.
ఓవరాల్ గా ట్రైలర్ లో కొత్తదనం లేదు. ఖచ్చితంగా చూడాల్సిందే అనిపించే కట్స్ లేవు. విశ్వక్ సేన్ ఖాతాలో మరో సినిమా అన్నట్టుగానే ఉంది. మరి సినిమా ఎట్టా ఉంటుందో చూడాల.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com