Lata Mangeshkar: లతా మంగేష్కర్ చివరి క్షణాల గురించి డాక్టర్లు ఏం చెప్పారంటే..

Lata Mangeshkar (tv5news.in)
X

Lata Mangeshkar (tv5news.in)

Lata Mangeshkar: ముంబాయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో లతా మంగేష్కర్ అడ్మిట్ అయ్యారు.

Lata Mangeshkar: గాన కోకిల లతా మంగేష్కర్ మరణం గురించి ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ ప్రముఖులు కూడా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇంకా ఆమె జ్ఞాపకాలను గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో జనవరి మొదటి వారంలో లతా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. అయితే ఆమె చనిపోయే ముందు చివరి క్షణాల్లో ఎలా ఉన్నారో డాక్టర్లు బయటపెట్టారు.

ముంబాయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో లతా మంగేష్కర్ అడ్మిట్ అయ్యారు. అక్కడే ఆమె కన్నుమూశారు కూడా. అక్కడ లతాకు చికిత్స చేసిన హెడ్ డాక్టర్ లతా మంగేష్కర్ చివరి క్షణాల గురించి అందరితో పంచుకున్నారు. లతా మంగేష్కర్ చనిపోయే ముందు కూడా ఆమె మోహం మీద చిరునవ్వు ఉందన్నారు డాక్టర్.

డాక్టర్ ప్రతీత్ సమాధాని ఇప్పుడే కాదు.. గత మూడేళ్లుగా లతా మంగేష్కర్‌కు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా.. ట్రీట్ చేస్తు్న్నారు. లతా మంగేష్కర్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పటి నుండి ఆమె ఆరోగ్యం రోజురోజుకీ క్షిణించిందని, డాక్టర్లంతా ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయామన్నారు ప్రతీత్. అయితే హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు తనను కూడా ఇతర పేషెంట్స్‌లాగా ట్రీట్ చేయాలని కోరారని ఆయన అన్నారు.

Tags

Next Story