Dhanush -Aishwarya Divorce : అంతా వారం రోజుల్లోనే జరిగిందా?

Dhanush -Aishwarya Divorce : కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్వర్యల విడాకులు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు ఎవ్వరూ కూడా వీరిద్దరూ విడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్-ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ కాదల్ కొండై సినిమా సమయంలో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి 2004లో ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరి మధ్య విభేదాలు రావడం, విడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే వీరి జీవితంలో కొన్నాళ్ల క్రితమే విభేదాలు వచ్చాయని, కానీ మామ(రజనీకాంత్)జ్యోక్యంతో గొడవలు సద్దుమణిగాయని కోలీవుడ్ టాక్. అసురన్ సినిమాకి ధనుష్ నేషనల్ అవార్డు, రజనీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఒకేసమయంలో అందుకున్నారు... ఆ టైంలో ఇద్దరితో కలిసున్న ఫోటోను ఐశ్వర్య షేర్ చేస్తూ ఇద్దరూ నా వాళ్లు అంటూ పోస్ట్ చేసింది.
ఇక రజనీకాంత్ అస్వస్థతకు గురైన సమయంలో కూడా ధనుష్ దగ్గరుండి మరి రజినీకి సేవలు చేశారని టాక్.. అంతేకాకుండా ఈనెలలోనే ప్రారంభమైన ధనుష్ ఫస్ట్ తెలుగు స్ట్రెయిట్ మూవీ 'సార్' చిత్ర షూటింగ్‌కి సైతం ఐశ్వర్య హాజరైంది. ఈ క్రమంలో ఈ జంట ఒక్కసారిగా విడిపోతున్నామని ప్రకటించడం అందర్నీ షాక్ కి గురిచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com