Selva Raghavan : 7/జి బృందావన కాలనీకి సీక్వెల్ వస్తోంది

Selva Raghavan :  7/జి బృందావన కాలనీకి సీక్వెల్ వస్తోంది
X

మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఒకప్పుడు క్లాసిక్స్ లాంటి మూవీస్ తీశాడు. క్లాసిక్స్ తో పాటు మాస్ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే క్లాస్ ను, మాస్ ను మెస్మరైజ్ చేసిన సినిమా 7/జి బృందావన కాలనీ. 2004 అక్టోబర్ 15న ఈ మూవీ రిలీజ్ అయింది. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఇప్పటికీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆ మధ్య రీ రిలీజ్ చేస్తే సూపర్ కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ మూవీకి సీక్వెల్ కావాలని అభిమానులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అది ఇన్నాళ్లకు నెరవేరబోతోంది.

న్యూ ఇయర్ సందర్భంగా 7/జి బృందావన కాలనీకి సీక్వెల్ షూటింగ్ చివరి దశకు వచ్చిందని అనౌన్స్ చేశాడు దర్శకుడు సెల్వ రాఘవన్. ఈ సారి కూడా ఇద్దరూ కొత్తవాళ్లతోనే ఈ మూవీని రూపొందిస్తున్నారని టాక్. 7/జి బృందావన కాలనీకి కథ, కథనాలు ఎంత హైలెట్ అయ్యాయో పాటలు అంతకంటే హైలెట్ అయ్యాయి. అన్ని సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అందుకే మరోసారి అదే మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజాను తీసుకున్నాడు సెల్వ రాఘవన్. బట్ కొన్నాళ్లుగా యువన్ టచ్ కోల్పోయాడు. అది కొంత ఆందోళన కలిగించే అంశం. ఇక ఫస్ట్ పార్ట్ ను నిర్మించిన ఏఎమ్ రత్నమే ఈ చిత్రాన్నీ నిర్మిస్తున్నాడు.Ravi Krishna

ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ చనిపోతుంది. హీరో ఆమె జ్ఞాపకాలతో పిచ్చివాడుగా మారిపోతాడు. అంతేకాక తను బ్రతికే ఉందనే భ్రమల్లో కూడా ఉంటాడు. మరి ఈ పాత్రను సెకండ్ పార్ట్ లో కూడా తీసుకువస్తాడా లేక ఫ్రెష్ గా మరో స్టోరీ చెబుతాడా అనేది చెప్పలేం కానీ.. 7/జి బృందావన 2 అనౌన్స్ మెంట్ ఆడియన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. మరి ఈ మూవీలో హీరో, హీరోయిన్ ఎవరు అనేది త్వరలోనే అనౌన్స్ చేస్తారట.

Tags

Next Story