Abbas: శంకర్ పిలిచి మరీ ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిన అబ్బాస్..!

Abbas:  శంకర్ పిలిచి మరీ ఆఫర్ ఇస్తే రిజెక్ట్  చేసిన అబ్బాస్..!
Abbas : దర్శకుడు శంకర్ సినిమాలన్ని చాలా అడ్వాన్స్‌‌గా ఉంటాయి.. అందుకే ఆయన నుంచి ఓ మూవీ వస్తుందంటే చాలు అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి

Abbas: దర్శకుడు శంకర్ సినిమాలన్ని చాలా అడ్వాన్స్‌‌గా ఉంటాయి.. అందుకే ఆయన నుంచి ఓ మూవీ వస్తుందంటే చాలు అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. కమల్ హాసన్‌‌తో భారతీయుడు చిత్రంతో భారీ హిట్ కొట్టి సెన్సేషన్ డైరెక్టర్‌‌‌‌గా మారిన శంకర్.. ఆ తర్వాత అంతకుమించి సినిమాని తీయాలని అనుకున్నారు కానీ అదెందుకో కుదరలేదు.. ఫైనల్‌‌గా జీన్స్ కథ ఆయనకి తట్టింది. ఓకే పోలికతో ఉన్న ఇద్దరు అబ్బాయిలు ఓకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్‌‌ని తీసుకొని విజువల్ వండర్‌‌గా జీన్స్ మూవీని తెరకెక్కించారు శంకర్.

ముందుగా ఈ సినిమాకి హీరోగా అబ్బాస్‌‌ని అనుకున్నారు శంకర్.. పిలిచి మరి ఆఫర్ చేశారు.. ప్రేమదేశం మూవీ సక్సెస్ కావడంతో అబ్బాస్ ఫుల్ బిజీలో ఉన్నాడు.. దాదాపుగా ఓ పది సినిమాలకి కమిట్ అయ్యాడు. దీనితో శంకర్ ఆఫర్‌‌ని రిజెక్ట్ చేశాడు అబ్బాస్. ఇక ఆ తర్వాత అజిత్‌‌ని అనుకున్నాడు శంకర్. కానీ కాల్షీట్ల కారణంగా జీన్స్ మూవీని పక్కన పెట్టాడు అజిత్.. చివరికి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే ప్రేమికుడు, ప్రేమదేశం మూవీ ఆఫర్ లని మిస్ చేసుకొని బాధపడుతున్న ప్రశాంత్‌‌కి ఇది మంచి ఆఫర్.. అప్పటికే కమిట్ అయిన ఏడు సినిమాలని కాదనుకొని శంకర్‌‌కి డేట్స్ ఇచ్చాడు ప్రశాంత్.

ఇక హీరోయిన్‌‌గా ఐశ్వర్య రాయ్.. అంతకుముందు భారతీయుడు సినిమాకి కూడా ఐశ్వర్యరాయ్‌‌నే హీరోయిన్‌‌గా అనుకున్నాడు శంకర్ .. కానీ ఆ సినిమాని ఐశ్వర్యరాయ్ రిజెక్ట్ చేసింది.. ఆ తర్వాత శంకర్ అంటే ఏంటో తెలిసి రావడంతో సింగిల్ సిట్టింగ్ లోనే జీన్స్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీన్స్ మూవీలో ఐశ్వర్యరాయ్ ని ఎనమిదో వింతగా చూపిస్తూ ప్రపంచంలోని ఏడు వింతలున్న ఏడు ప్రదేశాల్లో పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం అనే పాటను చిత్రీకరించారు శంకర్.. ఈ ఒక్క పాట కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు చేశారాయన.. అప్పట్లో దీని గురించి ఇంటర్నేషనల్ మీడియా కూడా రాసింది. ఈ సినిమా తర్వాత ఐశ్వర్యరాయ్‌ కి స్టార్ డం వచ్చింది.

24 ఏప్రిల్ 1998 సంవత్సరం రిలీజైన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ్ లో కంటే తెలుగులోనే ఈ సినిమా సూపర్ హిట్ కావడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story