Allu Arjun caravan : అల్లు అర్జున్ కార్వాన్కు ప్రమాదం

X
By - TV5 Digital Team |6 Feb 2021 7:25 PM IST
అల్లు అర్జున్ కార్వాన్కు ప్రమాదం జరిగింది. పుష్ప షూటింగ్ కోసం రంపచోడవరం వెళ్తుండగా.. ఖమ్మం జిల్లా కరుణగిరి బ్రిడ్జి సమీపంలో కార్‌వాన్‌ను ఓ కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టింది.
అల్లు అర్జున్ కార్వాన్కు ప్రమాదం జరిగింది. పుష్ప షూటింగ్ కోసం రంపచోడవరం వెళ్తుండగా.. ఖమ్మం జిల్లా కరుణగిరి బ్రిడ్జి సమీపంలో కార్‌వాన్‌ను ఓ కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టింది. కార్‌వాన్ సడెన్ బ్రేక్ వేయడంతో.. కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రమాద సమయంలో అల్లు అర్జున్ కార్‌వాన్‌లో లేరు. ఆ కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడంతో అక్కడున్నవారు హీరోకు గాయాలు అయి ఉంటాయనుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఘటనకు సంబంధించి చిత్ర యూనిట్ ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com