సినిమా

Dhanush : ధనుష్‌‌కు కరోనా.. 'సార్'కు బ్రేక్...!

Dhanush : యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో చేస్తోన్న స్ట్రైట్ మూవీ ‘సార్’...

Dhanush : ధనుష్‌‌కు కరోనా.. సార్కు బ్రేక్...!
X

Dhanush : యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో చేస్తోన్న స్ట్రైట్ మూవీ 'సార్'... ఇటీవలే ఈ సినిమా షూటింగ్ గ్రాండ్‌‌గా లాంచ్ అయింది. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా నిర్మాణం జరుపుకుంటోంది. తెలుగులో సార్ అనే టైటిల్‌‌తో తమిళ్‌‌లో వాత్తి అనే పేరుతో విడుదలవుతుంది.. అయితే హీరో ధనుష్‌‌కి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో షూటింగ్‌‌ని వెంటనే ఆపేశారు.

ప్రస్తుతం ధనుష్ ఐసోలేషన్‌‌లో ఉన్నారు. దీనితో మరి పదిరోజుల వరకు ఆయన సెట్స్ లోకి వచ్చే ఛాన్స్ లేదు.. మొదటి షెడ్యూల్‌‌ని మేకర్స్ భారీగా ప్లాన్ చేశారట. ఎక్కువ సీన్స్ ధనుష్ మీదే ఉన్నాయట.. ఈ క్రమంలో ధనుష్‌‌కి కరోనా నిర్ధారణ కావడంతో అందరు షాక్ అయ్యారట.. కాగా ఈ సినిమాని సితారా ఎంటర్‌‌టైన్ మెంట్స్, ఫర్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధనుష్ ఫస్ట్ స్ట్రైట్ తెలుగు మూవీ కావడంతో సినిమా పైన భారీ అంచనాలున్నాయి. అటు ధనుష్ సోదరుడు, తమిళ్ డైరెక్టర్ సెల్వారాఘవన్ కూడా కరోనా బారిన పడ్డారు.

Next Story

RELATED STORIES