Hero Dhanush: కొత్త లుక్ లో ధనుష్..!
తమిళ సూపర్ స్టార్ ధనుష్ తిరుమల శ్రీవారిని దర్శిచుకున్నారు. తన కుమారులు యాత్ర, లింగంతో కలిసి ఆలయాన్ని దర్శించుకోవడంతో భక్తులు వారిని చూసేందుకు ఆసక్తిని కనబరిచారు. ధనుష్ తలనీలాలను స్వామివారికి సమర్పించినట్లు తెలుస్తోంది. నెవీ బ్లూ కలర్ షర్ట్ లో గుండు చేసుకుని మెడలో రుద్రాక్షమాలను ధరించాడు ధనుష్. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రానున్న 'ఢీ 50' కోసమే ధనుష్ గుండుతో కనిపించాడని అభిమానులు అనుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఆయన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన కెప్టెన్ మిల్లర్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇందులో ధనుష్ ముడివేసిన పొడవాటి జుట్టుతో, పెరిగిన గడ్డంతో కనిపించాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యునిట్ తాజాగా రిలీజ్ చేయగా ఆయన అభిమానుల సంతోషానికి అంతే లేకుండా పోయింది. ఇందుకు పూర్తి డిఫరెంట్ లుక్ లో గుండుతో కనిపించాడు ధనుష్. మరో సారి ఆశ్చర్యం వ్యక్తం చేయడం అభిమానుల వంతైంది.
'కెప్టెన్ ముల్లర్' సినిమా కోసం రెండో ప్రపంచ యుద్ధం నాటి లైట్ మెషిన్ గన్ ను వాడినట్లు చిత్ర యునిట్ తెలిపింది. ఫస్ట్ లుక్ లో ఆయన చుట్టూ అనేక మృతదేహాలు పడిఉన్నాయి. చేతిలో లైట్ మెషిన్ గన్, ముడివేసిన జుట్టు, పెరిగిన గడ్డం, కాళ్లకు మామూలు చెప్పులు వేసుకుని ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. గతంలో రాకీ, సాయి కాయిదం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్, శివరాజ్ కుమార్, నివేదిత సతీష్, సందీప్ కిషన్ ముఖ్య పాత్రలు పోషించారు. 'కెప్టెన్ మిల్లర్' కు ట్యాగ్ లైన్ గా 'గౌరవమే స్వతంత్రం' అని జోడించబడి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com