Kiran Abbavaram : చిరంజీవి బర్త్ డే రోజు హీరో హీరోయిన్ పెళ్లి

Kiran Abbavaram :   చిరంజీవి బర్త్ డే రోజు హీరో హీరోయిన్ పెళ్లి
X

రీల్ కపుల్ రియల్ కపుల్ గా మారడం ఎప్పటి నుంచో ఉంది. ఒకే సినిమాలో కలిసి నటించిన జంట నిజ జీవితంలో పెళ్లి చేసుకుని కాపురం పెట్టేసిన వాళ్లు ఎంతోమందిని చూశాం. అయితే ఫస్ట్ మూవీ నుంచే లవ్ లో పడి ఆ తర్వాత ఆ అమ్మాయి వేరే సినిమా చేయకుండా, అంతకు ముందు ఒప్పుకున్నవి మాత్రమే కంప్లీట్ చేసి ఆ హీరోనే పెళ్లి చేసుకోవడం మాత్రం కాస్త అరుదు. అలాంటి అరుదైన జంటగా మారబోతోంది కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్. కిరణ్ ఫస్ఠ్ మూవీ రాజావారు రాణిగారు చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా బాగా ఆకట్టుకుంది. అయితే ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని వాళ్లు చెప్పేదాకా చాలామంది గెస్ చేయలేకపోయారు. కొన్ని రూమర్స్ వచ్చిన.. చాలామంది నిజం కాదనే అనుకున్నారు. బట్ ఫైనల్ గా వాళ్లే కన్ఫార్మ్ చేయడంతో కొంత ఆశ్చర్యపోయారు. ఇక రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇక పెళ్లికి ముహూర్తం సెట్ అయింది.

ఈ నెల 22న కూర్గ్ లో కిరణ్, రహస్యల వివాహం జరగబోతోంది. ఈ పెళ్లికి లిమిటెడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అటెండ్ అవుతున్నారు. తర్వాత జరిగే రిసెప్షన్ కు ఎలాగూ టాలీవుడ్ అంతా వెళుతుంది. అయితే వీరి పెళ్లి రోజు చిరంజీవి బర్త్ డే కావడం విశేషం. ఆ కారణంగా ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్నారా లేక ముహూర్తం అలా సెట్ అయిందో కానీ.. ఇలా కూడా వీరి మ్యారేజ్ హాట్ టాపిక్ కాబోతోంది. మొత్తంగా రియల్ కపుల్ కాబోతోన్న ఈ రీల్ కపుల్ కు కంగ్రాట్స్ చెప్పేద్దాం.

Tags

Next Story