Hero Karthi : హీరో కార్తీకి యాక్సిడెంట్

తమిళ్ టాలెంటెడ్ హీరో కార్తీకి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అతను సర్దార్ 2 మూవీ కోసం మైసూర్ షూటింగ్ లో ఉన్నాడు. ఆ షూటింగ్ టైమ్ లోనే అతనికి ఈ ప్రమాదం జరిగింది. కాలికి గాయం అయింది. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ ఏం వర్రీ అవ్వొద్దు అని సమాచారం ఇచ్చారు. ఎందుకంటే కాలికి గాయం అయింది. ఫ్రాక్చర్ కాదు. అందువల్ల ఒక వారం పది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్స్ చెప్పారట. దీంతో సర్దార్ 2 షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.
2022 అక్టోబర్ 21న విడుదలైంది సర్దార్. ఆ టైమ్ లో క్రిటిక్స్ నుంచి అప్లాజ్ వచ్చింది. కానీ కమర్షియల్ భారీ విజయం సాధించలేదు. బట్ ఈ కథలోని ప్లాట్ కు మాత్రం ఫిదా అవ్వాల్సిందే. నీటిని దోచుకోవడానికి కార్పోరేట్ శక్తులు ఎంత పెద్ద కుట్ర పన్నారు. తద్వారా వాళ్లు ఈ దేశాన్ని ఎంతలా దోచుకుంటున్నారు అనే పాయింట్ తో సాగుతుంది. ఈ క్రమంలో ఓ నిజాయితీ పరుడైన రా ఏజెంట్ కుటుంబం ఎలా బలైంది.. అనే కోణం అద్భుతం అనిపిస్తుంది. కార్తీ డ్యూయొల్ రోల్ లో నటించిన ఈ చిత్రాన్ని పిఎస్ మిత్రన్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీకే ఇప్పుడు సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో ‘ఒన్స్ ఎన్ ఏజెంట్ ఈజ్ ఆల్వేస్ ఏజెంట్’అనే డైలాగ్ తో ముగుస్తూ.. సర్దార్ వెళ్లిపోతాడు. మరి అక్కడి నుంచి కథ మొదలవుతుందా.. అతని కొడుకు కోణంలో సాగుతుందా అనేది చూడాలి.
ఫస్ట్ పార్ట్ లో రాశిఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ పార్ట్ లో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ జాయిన్ అయ్యారు. రజీషా విజయన్ కూడా కనిపిస్తుందట. అలాగే ఫస్ట్ పార్ట్ లో చుంకీ పాండే విలన్. ఈ పార్ట్ కోసం ఎస్.జే సూర్యను తీసుకున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తోన్న సర్దార్ 2ను మే 31న విడుదల చేయాలనుకున్నారు. మరి ఈ ప్రమాదం కారణంగా ఆ డేట్ మారుతుందా లేక అదే డేట్ కు వస్తారా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com