డైరెక్టర్ కి లిఫ్ట్ ఇస్తా అంటున్న కార్తీ

ఆర్టిస్టులు డైరెక్టర్స్ అవడం, డైరెక్టర్స్ ఆర్టిస్టులు కావడం చూస్తుంటాం. కాకపోతే నటులు దర్శకులవడం అంటే వారి ప్యాషన్ అంటారు. దర్శకులు నటులు అయ్యారంటే వారికి ఆఫర్స్ లేవు అంటారు. యస్.. చాలా వరకూ దర్శకులు తమకు వచ్చిన వరుస ఫ్లాపుల వల్ల కొత్త నిర్మాతలు దొరక్కే నటులుగా కొత్త అవతారం ఎత్తుతారు. ఎందుకంటే ప్రతి దర్శకుడూ మంచి నటుడే అయి ఉంటాడు. అలా ఒకప్పుడు డైరెక్టర్ గా తిరుగులేని విజయాలు అందుకున్న గౌతమ్ మీనన్ కొన్నాళ్లుగా ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో నటుడుగా టర్న్ తీసుకున్నారు. పాత్రలో పనిలేకుండా దాదాపు అన్ని సినిమాల్లో కనిపిస్తున్నాడు. అఫ్ కోర్స్ పాత్ర అంటే మాగ్జిమం పోలీస్ ఆఫీసర్ గానే ఎక్కువగా కనిపిస్తున్నాడు. అతను ఎప్పుడో డైరెక్ట్ చేసిన ధృవ నక్షత్రం అనే తమిళ్ మూవీ రిలీజ్ అయితే తనకు మళ్లీ కొత్త ఆఫర్స్ వస్తాయి అనే నమ్మకంతో ఉన్నాడు. విక్రమ్ హీరోగా నటించిన ప్రతి యేడాది రెండు మూడు సార్లు ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ అవుతుంది. కానీ సినిమా రాదు. ఈ ఇయర్ కూడా సమ్మర్ లో రిలీజ్ అనే పోస్టర్స్ కోలీవుడ్ లో ఉన్నాయి.
అయితే ఆ మూవీ రిలీజ్ తో పనిలేకుండానే గౌతమ్ మీనన్ తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు కార్తీ. రీసెంట్ గా ఈ ఇద్దరూ కలిశారు. గౌతమ్ చెప్పిన కథ కార్తీకి నచ్చింది. దీంతో అతనికి హామీ ఇచ్చాడు. కాకపోతే కార్తీ ఇప్పుడు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాత ఉంటుందేమో. అదే టైమ్ లో అతని ఖైదీ 2 కూడా ప్లానింగ్ లో ఉంది. అది స్టార్ట్ అయితే గౌతమ్ ప్రాజెక్ట్ మరింత లేట్ అవుతుంది. ఏదేమైనా కార్తీ లాంటి స్టార్ హీరో ఇప్పుడు గౌతమ్ మీనన్ కు అవకాశం ఇవ్వడం అంటే పెద్ద విషయం అనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com