చిన్నారి కుటుంబానికి అండగా ఉంటా: మంచు మనోజ్

చిన్నారి కుటుంబానికి అండగా ఉంటా: మంచు మనోజ్
సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు హీరో మంచు మనోజ్.

సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు హీరో మంచు మనోజ్. చిన్నారి కుటుంబానికి ఎల్లవేళలా తోడుంటానన్నారు. నిందితుడు ఇంకా దొరకలేదని తెలుస్తోందని.. ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మూడేళ్ల క్రితం చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ఉరిశిక్ష వేయాలని ఇప్పుడు తీర్పు వచ్చిందని, అలాంటి ఆలస్యాలు జరక్కుండా.. 24 గంటల్లోనే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు. టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యానిమేషన్లు వేయకుండా.. ఇలాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story