'మా' ను యువరక్తంతో ముందుకు తీసుకెళ్తా: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ అసోసియేషన్ అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు హీరో మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్నానని తెలపడం గౌరవప్రదంగా భావిస్తున్నానని ప్రెస్‌నోట్ విడుదల చేశారు. మా అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా తన సేవలను సంపూర్ణంగా అదించాలనుకుంటున్నాని చెప్పారు హీరో మంచు విష్ణు. సినిమా పరిశ్రమను నమ్మిన కుటుంబంలో తాను పుట్టానని.. తెలుగు సినిమాతోనే పెరిగానన్నారు.
మా ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు ప్రత్యక్షంగా చూస్తూ పెరిగానని.. తనకు, తన కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్టలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు తామెంతో రుణపడి ఉన్నామంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. మా అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా తన తండ్రి చేసిన సేవలు, వారి అనుభవాలు, నాయకత్వ లక్షణాలు తనకు మార్గదర్శకాలు అయ్యాయని చెప్పారు. గతంలో మా అసోసియేషన్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశానని.. ఆ సమయంలో కొన్ని సలహాలు, సూచనలు చేశానని తెలిపారు. ఇక హీరో మంచు విష్ణు కూడా బరిలోకి దిగడంతో..మా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరిగా సాగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com