Hero Trailer : జక్కన చేతుల మీదుగా 'హీరో' మూవీ ట్రైలర్‌

Hero Trailer : జక్కన చేతుల మీదుగా  హీరో మూవీ ట్రైలర్‌
X
Hero Trailer : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతోన్న మూవీ 'హీరో'. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Hero Trailer : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతోన్న మూవీ 'హీరో'. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. సోషల్‌ మీడియా వేదికగా దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేశాడు. విడుదలైన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ ఇలా అన్నీఅంశాలను ప్రధానంగా తీసుకుని చిత్ర ట్రైలర్ ని కట్ చేశారు మేకర్స్.. యాక్షన్ సన్నివేశాల కోసం బాగానే ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావు, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా పైన మంచి అంచనాలే ఉన్నాయి.



Tags

Next Story