నా బెస్ట్ వాలంటీర్లలో నా వైఫ్ ఒకరు: హీరో నిఖిల్

నా బెస్ట్ వాలంటీర్లలో నా వైఫ్ ఒకరు: హీరో నిఖిల్
నా భార్య డాక్టర్ కూడా కావడంతో ఆ పని మరింత సమర్ధవంతంగా చేయగలుగుతున్నాను.

మా అంకుల్ ఒకరు కరోనా కాటుకు బలయ్యారు. ఆక్సిజన్ అందక, ఆస్పత్రిలో బెడ్ దొరక్క మరణించిన వారు ఎందరో. నా వంతు సాయంగా ఏదైనా చేయాలనుకున్నాను. నా భార్య డాక్టర్ కూడా కావడంతో ఆ పని మరింత సమర్ధవంతంగా చేయగలుగుతున్నాను. ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మందికి పైగా సాయం అందించాను అని చెబుతున్నారు హీరో నిఖిల్.

సోనూసోద్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బెడ్ దొరకాలంటే నాలుగైదు గంటలు పడుతుందని చెప్పారు. నేను, నా వలంటీర్లు వీలైనంత మందికి సాయం చేస్తున్నాం. నేను చేస్తున్న సాయం చూసి అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కొందరు డబ్బులు పంపిస్తామని ముందుకు వచ్చారు.

కానీ ఎవరి నుంచీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇబ్బందుల్లో ఉన్న వారి వివరాలు పోస్ట్ చేస్తా. మీరే వారికి నేరుగా సాయం చేయండని చెప్పా. ఆ విధంగా రోజుకి మరో నాలుగు వందల మందికి సాయం చేసే అవకాశం వచ్చింది.

ఫార్మా కంపెనీలతో మాట్లాడి మెడిసిన్స్ తెప్పించా. ఆక్సిజన్ సిలిండర్లు కొన్నాను. ఈ విషయంలో నా భార్య పల్లవి, బావగారు నాకు హెల్ప్ చేశారు. పల్లవి కూడా నాతో పాటు వచ్చి పేషెంట్లను చూసి మందులు రాసేది. వాళ్ల లక్షణాలు చూసి వారికి ఏం కావాలో ఏం పంపించాలో చెప్పేది. నా బెస్ట్ వాలంటీర్లలో నా వైఫ్ ఒకరు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి సిటీ, టౌన్ లో ఇద్దరు ముగ్గురు డాక్టర్లు నా స్నేహితులు కావడంతో నాకు మరింత సాయం అందించడానికి వీలైంది. అలా విజయవాడలో ఓ మహిళకు బాలేదంటే ఆక్సిజన్ సిలిండర్ పంపించాం. ఆమె భర్త ఫోన్ చేసి థాంక్స్ చెప్పారు.

కానీ ఆ మర్నాడే మరణించిందని చెప్పే సరికి చాలా బాధేసింది. అటువంటి ఘటనలు కొన్ని జరిగాయి. కరోనా బారిన పడితే ఆస్తులు, ప్రాణాలు రెండూ పోతాయి. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వేయించుకోవాలి.

కాగా, నిఖిల్ నటించిన 18 పేజెస్ లుక్ మంగళవారం విడుదల చేశారు. సుకుమార్ గారు రాసిన ఈ ప్రేమకథ చాలా వైవిధ్యంగా ఉంటుందని అన్నారు నిఖిల్. ఆయన నటించిన మరో చిత్రం కార్తికేయ 2 చిత్రీకరణ 50 శాతం పూర్తయింది.

Tags

Read MoreRead Less
Next Story