Hero Nithiin : తండ్రి అయిన హీరో నితిన్

Hero Nithiin :    తండ్రి అయిన హీరో నితిన్

స్టార్ హీరో నితిన్ తండ్రి అయ్యాడు. అతనికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలియజేశాడు. నితిన్ ది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. షాలినితో అతని పెళ్లి 2020లో జరిగింది. చాలాకాలం పాటు ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరిని చూసిన వాళ్లంతా క్యూట్ కపుల్ అంటారు. షాలిని ఎక్కువగా సోషలైట్ కాదు. సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించదు. ఈ తొలి సంతానం ఆ కుటుంబంలో మంచి ఆనందాలను నింపింది.

ఇక సినిమాల పరంగా చూసుకుంటే నితిన్.. ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు అనే సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండూ భిన్నమైన నేపథ్యాల్లో రూపొందుతోన్న సినిమాలు. రాబిన్ హుడ్ ను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు. తమ్ముడు చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు నితిన్. మరి బిడ్డ వచ్చిన వేళ ఈ రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్ అవుతాయేమో చూడాలి.

Tags

Next Story