Keerthi Suresh : వెంకటేష్, కీర్తి సురేష్ లతో.. నితిన్ సినిమా

టాలీవుడ్ లో మరో వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ రెడీ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఇంత ఇంట్రెస్టింగ్ కాంబో గురించిన వార్తలే వినలేదు అనేలా ఉందీ కాంబో. హీరోగా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న నితిన్ తమ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ ను రూపొందించబోతున్నాడు. వెంకటేష్, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అన్నట్టు ఇదే మూవీలో నితిన్ కూడా ఓ కీలకమైన కేమియో రోల్ చేయబోతున్నాడట. అది చివర్లో వస్తుందని చెబుతున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను డీల్ చేసే దర్శకుడు ఎవరూ అనుకుంటున్నారు కదా.
గతంలో నిఖిల్ తో అర్జున్ సురవరం అనే ఇన్వెస్టిగేటివ్ మూవీతో హిట్ కొట్టిన టిఎన్ సంతోష్ అనే తమిళ్ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. విశేషం ఏంటంటే.. ఇది కూడా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరేనట. వెంకీ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు అంటున్నారు. అయితే ఇంకా అతను ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బట్ స్టోరీ విని ఇంప్రెస్ అయ్యాడట. కీర్తి సురేష్ రెగ్యులర్ గా కాక ఓ క్రూషియల్ రోల్ చేయబోతోందని సమాచారం. అలాగే ఖైదీ, విక్రమ్, దేవర ఫేమ్ నరేన్ మరో కీలకమైన పాత్ర చేస్తాడట. ఎలా చూసినా ఓ క్రేజీ ప్రాజెక్ట్ లా కనిపిస్తోన్న ఈ మూవీలో వెంకటేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. మొత్తంగా నితిన్ భలే కాంబినేషన్ సెట్ చేస్తున్నాడు కదా..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com