గోపీచంద్ సినిమాలో రాజశేఖర్‌కి భారీ రెమ్యునరేషన్‌.. విత్ కండిషన్స్..!

గోపీచంద్ సినిమాలో రాజశేఖర్‌కి భారీ రెమ్యునరేషన్‌.. విత్ కండిషన్స్..!
యాంగ్రీ మెన్ రాజశేఖర్‌‌కి ఇప్పుడు పెద్దగా మార్కెట్ లేకపోవచ్చు.. కానీ ఓ 20 ఏళ్ల క్రితం చూసుకుంటే అయన సినిమాలతో బాక్స్‌‌ఆఫీస్‌‌ని షేక్ చేశారు.

యాంగ్రీ మెన్ రాజశేఖర్‌‌కి ఇప్పుడు పెద్దగా మార్కెట్ లేకపోవచ్చు.. కానీ ఓ 20 ఏళ్ల క్రితం చూసుకుంటే అయన సినిమాలతో బాక్స్‌‌ఆఫీస్‌‌ని షేక్ చేశారు. చిరంజీవి లాంటి స్టార్ హీరోతో ఆయన పోటీపడ్డారు. అప్పట్లో భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలో రాజశేఖర్ ఒకరు. అయితే ఈ మధ్య ఆయన చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. అ మధ్య 'గరుడ వేగ'తో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కి.. కల్కి సినిమాతో పలకరించాడు. ప్రస్తుతం హీరోగా శేఖర్ అని సినిమాని చేస్తున్నారు రాజశేఖర్. ఇదిలావుండగా గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో రాజశేఖర్ హీరో అన్నయ్య పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర సినిమాలో కీలకం కావడంతో దర్శకుడు శ్రీవాస్ రాజశేఖర్‌‌ని సంప్రదించారట. రాజశేఖర్‌కి కూడా పాత్ర నచ్చడంతో ఓకే చెప్పారట.. అంతేకాకుండా కొన్ని కండీషన్స్‌ పెట్టారట. సినిమాకి గాను రూ. 4 కోట్లు పారితోషికంగా ఇవ్వాలని, పాత్ర గౌరవప్రదంగా వుండాలని కండిషన్స్ పెట్టారట. అన్నింటికీ ఒప్పుకుని ఆయనను తీసుకుందట చిత్ర యూనిట్. ఈ పాత్ర సినిమాలో కీలకం అని, దీనితో జగపతి బాబు మాదిరిగా కొంత క్యారెక్టర్ నటుడు తెరపైకి వస్తారని శ్రీవాస్ అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story