Ram Charan : పవన్ తో మల్టీస్టారర్.. కన్ఫమ్ చేసిన చరణ్..!

Ram Charan : పవన్ తో మల్టీస్టారర్.. కన్ఫమ్ చేసిన చరణ్..!
Ram Charan : చిరు,పవన్, చిరు,చరణ్, పవన్,చరణ్ ఇలాంటి కాంబినేషన్ కోసం మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

Ram Charan : చిరు,పవన్, చిరు,చరణ్, పవన్,చరణ్ ఇలాంటి కాంబినేషన్ కోసం మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అ మధ్య చిరు,పవన్ లతో నిర్మాత టి సుబ్బరామి రెడ్డి ఓ సినిమాని కూడా ప్లాన్ చేశారు.. దీనికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారన్న చర్చ నడిచింది.. సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ సినిమా ఆగిపోయింది.

ఇదిలావుండగా... ప్రస్తుతం చిరు,చరణ్‌ల కాంబినేషన్‌లో ఆచార్య మూవీ తెరకెక్కింది.. కొరటాల శివ దర్శకత్వంలో రూపోందిన ఈ సినిమా 29 ఏప్రిల్ 2022న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అయితే సినిమా ప్రమోషన్ సందర్భంగా మెగా అభిమానులకి అదిరిపోయే న్యూస్ చెప్పాడు.. తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి ఒక చిత్రంలో నటించనున్నట్లు వెల్లడించాడు.

దీనిపై ఇప్పటికే చర్చించామని, రానున్న రోజుల్లో ఈ సినిమా గురించి వెల్లడిస్తామని తెలిపాడు.. ఈ మల్టీస్టారర్ మూవీని తానే స్వయంగా నిర్మిస్తానని రామ్ చరణ్ వెల్లడించాడు.చరణ్ చెప్పిన గుడ్ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అటు ఈ ఏడాది ఫిబ్రవరిలో భీమ్లానాయక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్.. ప్రస్తుతం హరిహరవీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్సకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.

Tags

Read MoreRead Less
Next Story