Sai Dharam Tej Discharge : సాయిధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్...!

Sai Dharam Tej Discharge : సాయిధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చిరంజీవి స్వయంగా ట్వీట్ చేసి అభిమానులకు శుభవార్త చెప్పారు. పైగా ఇవాళ సాయిధరమ్ పుట్టిన రోజు కావడంతో బర్త్‌డే విషెష్ వెల్లువెత్తుతున్నాయి. పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి విడుదలవడం, పుట్టినరోజు కూడా కావడంతో చిరు ట్వీట్ చేశారు.
పండగరోజైన విజయ దశమి నాడు సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చాడని చెప్పుకొచ్చారు చిరు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ తేజ్‌కు ఇది పునర్జన్మ అంటూ తేజ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. అటు అల్లు అర్జున్ కూడా తేజ్‌కు విష్ చేస్తూ ట్వీట్ చేశాడు. రాబోయే రోజులన్నీ అద్భుతంగా ఉండాలని, అందరి హృదయాలు గెలవాలని ఆకాంక్షిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.
వినాయక చవితి రోజున బైక్‌పై వెళ్తున్న సాయి ధరమ్ తేజ్.. ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. కాలర్ బోన్ విరగడంతో సర్జరీ చేశారు. ప్రమాద తీవ్రత కారణంగా సాయిధరమ్ తేజ్ కోమాలోకి వెళ్లాడని స్వయంగా పవన్ కల్యాణే కామెంట్ చేశారు. 35 రోజుల పాటు చికిత్స తీసుకున్న సాయిధరమ్ తేజ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. వినాయక చవితి పండగ రోజు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరిన సాయిధరమ్ తేజ్.. విజయదశమి రోజున ఇంటికి చేరుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com