DJ Tillu: నిన్న హీరోయిన్.. నేడు హీరో.. నటి పుట్టుమచ్చల ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్..

DJ Tillu: నిన్న హీరోయిన్.. నేడు హీరో.. నటి పుట్టుమచ్చల ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్..
DJ Tillu: తన అభిప్రాయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు సిద్ధు. చాలామంది నెటిజన్లు కూడా సపోర్ట్‌గా స్పందిస్తున్నారు.

DJ Tillu: 'డీజే టిల్లు' సినిమా గురించి ఇప్పటివరకు చాలా తక్కువమందికే తెలిసినా.. ఈ సినిమా చుట్టూ అల్లుకున్న ఓ వివాదం వల్ల ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్న.. ఒక్కసారిగా మూవీ టీమ్ అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ సమయంలో ఎవరూ, ఏమీ స్పందించకపోయినా.. నిన్న హీరోయిన్ నేహా శెట్టి ఈ ప్రశ్నపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా హీరో సిద్ధు కూడా దీనిప స్పందిస్తూ.. ట్వీట్ చేశాడు.

డీజే టిల్లు ట్రైలర్‌లో ఉన్న హీరోయిన్ ఒంటిపై పుట్టుమచ్చల డైలాగును హైలెట్ చేస్తూ.. ఓ రిపోర్టర్ నిజంగానే హీరోయిన్ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో లెక్కపెట్టారా అని అడగగా.. అప్పుడు సిద్ధు దానికి ఏమీ స్పందించలేదు. తాజాగా దీనిపై తన అభిప్రాయాన్ని ఒక లెటర్ రూపంలో ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. చాలామంది నెటిజన్లు కూడా సిద్ధుకు సపోర్ట్‌గా స్పందిస్తున్నారు.

'నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఓ అర్థం లేని ప్రశ్నను ఎదుర్కున్నాను. చాలామంది నేను అలా ఎందుకు స్పందించానని అడుగుతున్నారు. నేను ఆ ప్రశ్నను చాలా మౌనంగా రిజెక్ట్ చేసే ప్రయత్నం చేశాను. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చి దానిని హైలెట్ చేయాలని అనుకోలేదు. బయటివారికి నటులపై ఎలాంటి అభిప్రాయం ఉందో ఈ ప్రశ్న తెలిసేలా చేస్తుంది.'

'రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి నటీనటులు చాలా కష్టపడతారు. ముఖ్యంగా హీరోయిన్స్.. తన హీరోతో ముద్దు సీన్ చేస్తున్న సమయంలో సెట్‌లో వందమందికి పైగా ఉంటారు. అలాంటి సమయంలో ఆ సీన్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. నేను అందరి నటుల తరపున చెప్పాలనుకుంటుంది ఏంటంటే.. ఇంత ధైర్యంగా నటిస్తున్నందుకు మాకు కూడా కొంచెం గౌరవం దక్కాలి. మేము కథలు చెప్తాం, ఎంటర్‌టైన్ చేస్తాం. అలా అని మేము చేస్తున్న పనిని బట్టి మా నిజ జీవితాలను జడ్జి చేయకూడదని మేము అనుకుంటాం'.

'దయచేసి ఈ విషయాన్ని అందరు ఇంతటితో వదిలేయాలని నేను కోరుకుంటున్నాను. నా సినిమాలో ఉన్న కంటెంట్ ద్వారా, దాంట్లో ఉన్న ఫన్ ద్వారా, ట్రైలర్‌ ద్వారా ప్రమోట్ అవ్వాలని అనుకుంటున్నాను. త్వరలోనే డీజే టిల్లు థియేటర్లలో సందడి చేసి మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, అన్ని రకాల ఎమోషన్స్‌ను పరిచయం చేస్తుంది' అంటూ ఈ వివాదానికి ఇక్కడే ఫుల్‌స్టాప్ పెట్టమని కోరాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ.

Tags

Read MoreRead Less
Next Story