Varun Sandesh : ట్రోలర్స్ కు హీరో భార్య వార్నింగ్

Varun Sandesh : ట్రోలర్స్ కు హీరో భార్య వార్నింగ్
X

ట్రోల్స్ .. కొన్నాళ్లుగా హద్దూ అదుపూ లేకుండా వస్తున్నాయి. వృత్తి పరంగానే కాక వ్యక్తిగతంగానూ టార్గెట్ చేస్తూ అవమానిస్తుంటారు కొందరు. ఇలాంటి ట్రోలర్స్ అందరికీ ఈజీ టార్గెట్ సినిమా వాళ్లే అవుతారు. తాజాగా హీరో వరుణ్ సందేశ్ పైనా ఇలాంటి ట్రోలింగ్స్, కమెంట్స్ పెడుతూ కొందరు నెగెటివ్ గా మాట్లాడుతున్నారు. అతను తన భార్య వితికాతో కలిసి ఉన్న ఫోటోలో జుత్తుకు సగం వైట్ అండ్ గ్రే కలర్ తో ఉన్నాడు. అది చూసిన కొందరు వరుణ్ సందేశ్ పై బ్యాడ్ కమెంట్స్ పెడుతూ ట్రోల్స్ చేస్తున్నారట. పైగా వాళ్లు ఫోటో దిగిన సందర్భం చూస్తే అదేదో వేడుకలాగా ఉంది. దీంతో ఇలాంటి వేడుకల్లో ఆ హెయిర్ స్టైల్ ఏంటీ అంటూ రకరకాలుగా కమెంట్స్ చేశారట. దీంతో విసిగిపోయిన వితిక.. అలాంటి అందరికీ

‘‘అందరికీ ఒక ముఖ్య గమనిక. సందేశ్ ఈ లుక్ ఏదైతే ఉందో అది ఒక సినిమాలో లుక్. ఒక ఆర్టిస్ట్ గా అది తన వృత్తి. మాటలు అనే ముందు కొంచెం ఆలోచించండి. ఇది నేను ఇచ్చే ఒక స్వీట్ వార్నింగ్. ట్రోల్స్ అండ్ నెగెటివ్ కామెంట్స్ కి ఒక హద్దు అనేది ఉంటది, అది దాటితే ఊరుకునేది లేదు..’’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఇలా పోస్ట్ చేసింది.

అయితే వరుణ్ సందేశ్ క సంబంధించిన ఈ లుక్ విరాజి అనే సినిమా లుక్. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ కూడా విడుదలైంది. కొన్నాళ్ల క్రితం పూర్తిగా డల్ అయిన వరుణ్ కెరీర్ మళ్లీ స్పీడందుకుంది. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆ లిస్ట్ లోని ఈ విరాజి సినిమాలోనిదే.. అతన్ని ట్రోల్ చేసిన లుక్.

Tags

Next Story