Vishal : అంత ఫిట్ గా ఉండే విశాల్.. ఇంత వీక్ అయ్యాడేంటీ..?

Vishal :  అంత ఫిట్ గా ఉండే విశాల్.. ఇంత వీక్ అయ్యాడేంటీ..?
X

తమిళ్ యాక్షన్ హీరోగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు తెలుగు వాడైన విశాల్. ఏ స్టంట్ అయినా తనే చేస్తాడు. డూప్ లు పెట్టుకోడు. అయితే కొన్నాళ్లుగా విశాల్ కెరీర్ ట్రాక్ తప్పింది. సరైన హిట్స్ లేవు. మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలున్నాయి. ఈ కారణంగానే పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. అయితే 2012లో రూపొందిన అతని సినిమా మదగజరాజా(ఎమ్.జి.ఆర్) ను తాజాగా విడుదల చేస్తున్నారు. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ అప్పట్లో క్రేజీ మూవీగా పేరు తెచ్చుకుంది. ఆ టైమ్ లో విశాల్, వరలక్ష్మి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందనే వార్తలు సౌత్ మొత్తం వినిపించాయి. వీటిని ఆ ఇద్దరూ ఖండించకపోవడంతో మరిన్ని న్యూస్ వినిపించాయి. తర్వాత ఇద్దరూ విడిపోయారు.

అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చాడు విశాల్. ఎప్పుడు చూసినా కంప్లీట్ ఫిట్ గా కనిపించే విశాల్.. ఈ ప్రమోషన్ ఈవెంట్ లో కనిసం చేతిలో మైక్ కూడా పట్టుకోలేకపోతున్నాడు. చేతులు వణుకుతున్నాయి. కళ్లు తేడాగా ఉన్నాయి. బాడీ అంతా ఏదో చాలాకాలంగా హాస్పిటల్ పాలైన పేషెంట్ లా కనిపిస్తున్నాడు. దీంతో విశాల్ కు ఏమైంది అని అంతా ఆశ్చర్యంతో ఆరాలు తీస్తున్నారు.

అయితే కొన్నాళ్ల క్రితం ఓ మూవీ షూటింగ్ లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. కంటికి బలమైన గాయాలు అయ్యాయి. వీటితో పాటు చాలా స్టంట్స్ లో దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ కొన్ని రోజుల క్రితం తిరగమోత పెట్టాయని.. ఆ కారణంగానే హాస్పిటలైజ్ అయ్యాడు అంటున్నారు. అందుకే అంత ఇబ్బందిగా కనిపించాడని చెబుతున్నారు. అలాగే అతనికి ప్రస్తుతం తీవ్రంగా ఫీవర్ కూడా ఉందట. అయినా సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చాడని.. అందుకే ఇలా తేడాగా ఉన్నాడంటున్నారు. ఏదేమైనా ఒకప్పుడు చాలా ఫిట్ గా కనిపించిన విశాల్.. ఇలా వణికిపోతూ మాట్లాడ్డం మాత్రం చాలా అనుమానాలకు తావిస్తోంది.

Tags

Next Story