
సోషల్ మీడియాలో భాగస్వామి ఫొటోలను డిలీట్ చేయడం సెలబ్రిటీల విడాకులకు హింట్‌గా నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి ఆ విధంగానే వార్తల్లో నిలిచారు. ఆమె తన భర్త వికాస్ వాసుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. దీంతో భర్తతో స్వాతి విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ ప్రమోషన్స్ సమయంలోనూ ఇలాంటి రూమర్సే రాగా స్పందించేందుకు స్వాతి నిరాకరించారు.
తెలుగులో పెద్ద ఆఫర్లు రాకున్నా ఇతర భాషల్లో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా తమిళ్, మలయాళంలో స్వాతి నటించిన సినిమాలకు మంచి స్పందన దక్కింది. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్వాతి మద్యలో గ్యాప్ తీసుకున్నా రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటున్నారు. 2018లో వికాస్‌ను వివాహం చేసుకున్న స్వాతి కొన్నాళ్లకే ఆయన నుంచి విడి పోయిందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో స్వాతి ఆ వార్తలను కొట్టి పారేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నుంచి పెళ్లి ఫోటోలతో పాటు, వికాస్‌తో ఉన్న ఫోటోలు అన్నింటిని డిలీట్ చేసింది. ఆ సమయంలోనే ఇద్దరూ విడి పోయారు అంటూ బలంగా ప్రచారం జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com