Meenakshi Seshadri: ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా.. ఆమేనా ఈమె!!

Meenakshi Seshadri: అప్పటికి ఇప్పటికీ మీరేం మారలేదు. అలానే ఉన్నారు అని ఎన్నో ఏళ్ల తరువాత కలిసినప్పుడు పలికే మొదటి పలకరింపు.. మరి గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పుడు అందాన్ని కాపాడుకోవడానికి వాళ్లు చేయని ప్రయత్నాలు ఉండవు. వయసు ఛాయలు మీదపడనివ్వకుండా అందానికి మెరుగులు దిద్దుతారు. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు. కానీ తాజాగా కనిపించిన మీనాక్షీ శేషాద్రిని చూస్తే.. ఔరా అమ్మక చెల్లా.. ఆలకించి నమ్మడమెల్లా అని అనుకోకుండా ఉండలేం. కే. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి, మీనాక్షీ శేషాద్రి ప్రధాన తారాగాణంగా వచ్చిన చిత్రం ఆపద్భాంధవుడు. ఇప్పటికీ టీవీల్లో వచ్చినా కళ్లార్పకుండా చూస్తారు ఆ అపురూప చిత్రాన్ని సినీ అభిమానులు. అందులోని పాటలు, మీనాక్షీ శేషాద్రి అభినయం అన్నీ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి.
18 ఏళ్ల వయసులో మిస్ ఇండియా టైటిల్‌ని సొంతం చేసుకుని పలు చిత్రాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది మీనాక్షి శేషాద్రి. ఆపధ్బాందవుడు కంటే ముందు తెలుగులో బ్రహ్మర్షి విశ్వామితలో నటించినా తగిన గుర్తింపు రాలేదు. కానీ 1992లో వచ్చిన ఆపద్భాంధవుడు చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. దాంతో బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.
బాలీవుడ్‌లో మరోసారి చిరంజీవి సరసన గ్యాంగ్ లీడర్ రీమేక్ చిత్రం ఆజ్ కా గూండారాజ్ సినిమాలో నటించింది. దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించిన మీనాక్షి 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలతో కుటుంబ జీవనాన్ని సాగిస్తోంది.
కాగా తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 57 ఏళ్ల మీనాక్షి ఫోటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమేనా ఈమె అని షాకవుతున్నారు. వయసుతో పాటు మార్పు సహజమే కానీ మరీ ఇంతలా గుర్తు పట్టలేనంతగా మారిపోయే సరికి అస్పలు పోల్చుకోలేకపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com