రామాయణంలో సీత.. కాల్షీట్లు లేవన్న అలియా
ప్రస్తుతం దర్శకుల చూపంత పౌరాణిక, ఇతిహాస గాథలపై పడింది. ఈ మధ్య వచ్చిన ఆదిపురుష్, శాంకుతలం చిత్రాలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనపోయినా దర్శకులు ఇటువంటి కథలను తెరకెక్కించడానికి మొగ్గు చూపుతున్నారు. తాజాగా మరో దర్శకుడు రామాయణం చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకు సంబంధించిన క్యాస్టింగ్ కూడా రెడీ అవుతోంది.
ఓ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రామాయణంపై మరో సినిమా తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. రణబీర్ కపూర్ రాముడిగా రామాయణంపై సినిమా తీయాలని నిర్మాత మధు మంతెన ప్లాన్ చేస్తున్నారు. సీత పాత్ర కోసం అలియా భట్‌ని, రావణ పాత్ర కోసం కెజిఎఫ్ యష్‌ని కూడా టీమ్ సంప్రదించింది.
అయితే అలియా భట్ పౌరాణిక నాటకానికి నో చెప్పిందని సమాచారం. నిజ జీవితంలో తన భర్త అయిన రణభీర్ తో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు ఆ ఆఫర్‌ను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందని చాలామంది ఆలోచించడం మొదలుపెట్టారు. ఆమె ఆఫర్‌ను తిరస్కరించడానికి ప్రధాన కారణం ఆమె బిజీ షెడ్యూల్ అని తెలుస్తోంది. అలియా భట్ క్యాలెండర్ నిండిపోయింది. ఆమె రామాయణం కోసం సమయాన్ని సర్దుబాటు చేయడానికి ఇష్టపడట్లేదు.
దర్శకులు నితీష్ తివారీ, రవి ఉద్యావర్ ఆమెను ఒప్పించడంలో విఫలమయ్యారు. మరోవైపు, యష్ ఈ చిత్రంలో భాగం కావడానికి పెద్దగా మొగ్గు చూపడం లేదు. వందల కోట్ల రూపాయలతో రామాయణంపై ఓ అద్భుత చిత్రాన్ని నిర్మించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించకుండా నిజమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ రామాయణాన్ని రూపొందించాలని మేకర్స్ అనుకుంటున్నారు.
మరీ ముఖ్యంగా ఆదిపురుష్ కోసం ఓం రౌత్ చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఉండాలనే యోచనలో ఉన్నట్టు వినికిడి. ప్రస్తుతానికి, అలియా భట్ ఆఫర్‌ను తిరస్కరించడంతో, మేకర్స్ మృణాల్ ఠాకూర్ ను కానీ, కియారా అద్వానీ కానీ ఆ పాత్ర కోసం సంప్రదించాలని చూస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com