సినిమా

శ్రీవారి సేవలో శ్రియా శరన్ దంపతులు..

కథానాయిక శ్రియ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో శ్రియా శరన్ దంపతులు..
X

కథానాయిక శ్రియ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ దర్శనంలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రియ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కారణం రెండు సంవత్సరాలుగా స్వామిని దర్శించుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం శ్రియా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవగణ్‌కు జోడీగా నటిస్తున్నారు. మరో చిత్రం గమనంలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

Next Story

RELATED STORIES