Hey Bhagavan Movie : హే భగవాన్.. ఇప్పుడేం చేయాలి..?

హే భగవాన్.. ఇప్పుడేం చేయాలి..? అంటూ ఈ మూవీ టీమ్ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. యస్.. సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన మూవీ హే భగవాన్. ఈ మూవీపై ముందు నుంచీ పాజిటివ్ బజ్ ఉంది. గ్యారెంటీ విజయం సాధిస్తుంది అనుకున్నారు. ప్రమోషన్స్ లో కూడా ఇలాగే ఆకట్టుకుంటున్నారు. బట్ తీరా చూస్తే ఇప్పుడీ మూవీ టైటిల్ మార్చాల్సిందే అని పట్టు పట్టింది సెన్సార్ బోర్డ్. ఈ టైటిల్ లో ఏం సమస్య ఉందో తెలియదు. బట్ వీళ్లు మాత్రం మార్చాల్సిందే అని చెప్పారు. సరేలే టైటిల్ లో ఏముందీ ఏదో ఒకటి చేసి మార్చేయొచ్చు అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఒక ట్విస్ట్ పెట్టింది టీమ్.
ఈ మూవీ టైటిల్ మాత్రమే కాదు.. సినిమాలో మొత్తం ఆ పదం వాడకూడదు అని చెప్పింది. కానీ సినిమాలో ఈ మాట పలికే సన్నివేశాలు చాలానే ఉంటాయట. దీంతో డబ్బింగ్ లో కూడా మార్చాల్సి ఉంది. అందుకే ఈ టీమ్ ఇప్పుడు హే భగవాన్ అని తలలు పట్టుకుంటోంది. మామూలుగా టైటిల్ వరకు మార్చేయొచ్చు అని భావించారు. బట్ ఇలా పదం మొత్తాన్ని మార్చాలి అని చెప్పడం మాత్రం కాస్త ఓవర్ అనే చెప్పొచ్చు. అయినా సెన్సార్ పట్టు పట్టింది కాబట్టి మార్చడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే ఈ నెల 20నే విడుదల కావాల్సిన ఈ మూవీ టీమ్ ఇప్పుడు హడావిడీగా ఆ పనిలో ఉండిపోయింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
