`హే చెలి..` వీడియో సాంగ్‌ రిలీజ్.. మెలోడీ బీట్ తో రొమాన్స్ చేస్తోన్న`మిస్ట‌ర్ ప్రెగ్నెంట్`

`హే చెలి..` వీడియో సాంగ్‌ రిలీజ్.. మెలోడీ బీట్ తో రొమాన్స్ చేస్తోన్న`మిస్ట‌ర్ ప్రెగ్నెంట్`
X
`మిస్ట‌ర్ ప్రెగ్నెంట్` నుంచి రొమాంటిక్ అండ్ మెలోడీ బీట్ వీడియో సాంగ్ రిలీజ్

'బిగ్ బాస్' ఫేమ్ సోహెల్ హీరోగా రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ ప్రెగ్నెంట్'. మైక్ మూవీస్ బ్యానర్ లో అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. మూవీలోని హే చెలి.. అనే వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆద్యంతం రొమాంటిక్ సీన్స్ తో రూపొందిన ఈ పాట.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి `హే చెలి..` అనే ఆహ్లాద‌క‌ర‌మైన మెలోడీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మ‌న‌సుని తాకే చ‌ల్ల‌టి చిరుగాలిగా ఈ పాట అలరిస్తోంది. ట్యూన్ కు అనుగుణంగా విజువల్స్ రూపొందించడంతో సినీ ప్రేక్షకులను ఈ సాంగ్ మరింత ఆకట్టుకుంటోంది. కాగా శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్ సంగీతం అందిస్తోన్న పాట‌ను శ్రీమ‌ణి రాశారు.

`మిస్ట‌ర్ ప్రెగ్నెంట్` మూవీ ప్రస్తుతం పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అయితే ఈ సినిమాను ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్.. ఇలా తాజా అప్ డేట్స్ తో వెరైటీగా, డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఈ సినిమాకు నిజార్ ష‌ఫి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

మరో ముఖ్య విషయమేమిటంటే ఈ సినిమాలో సోహెల్ 'ప్రెగ్నెంట్' గా కనిపించనున్నారు. దీంతో ఈ మూవీ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ తో ఎలాంటి సినిమాలూ రాలేదు. కాబట్టి ఇదో కొత్త ప్రయత్నమని చెప్పవచ్చు. దీంతో సినిమాపై మేకర్స్ మంచి అంచనాలే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల షూటింగ్ చాలా ఆల‌స్య‌మైంది. మూవీ అనౌన్స్‌చేసిన మూడేళ్ల త‌ర్వాత.. ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇక 'ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య' సినిమాతో అలరించిన రూప.. ఈ సినిమాలో ఎలా ఉండబోతోందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలి కాలంలో సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్, టైటిల్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మిస్టర్ ప్రెగ్నెంట్ సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్ారు. ఇక ఈ సినిమాలో సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు కీలక పాత్రలో అలరించనున్నారు.






Tags

Next Story