Punith RajKumar: కర్ణాటకలో హై అలర్ట్.. థియేటర్లు క్లోజ్..

Punith RajKumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆరోగ్యం విషమంగా ఉండడంతో కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రి వద్దకు వేలాదిగా అభిమానులు చేరుకుంటుండటంతో వారిని అదుపు చేసేందుకు భారీగా బలగాలను మోహరించారు. ఇక కర్ణాటక వ్యాప్తంగా కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
రాజ్ కుమార్ ఆరోగ్యంపై ఆందోళనతో కర్ణాటకలో థియేటర్లన్నీ మూసివేసినట్టుగా తెలుస్తోంది. రాజ్ కుమార్ ఆరోగ్యం విషమంగా ఉండడంతో సీఎం బసవరాజ్ బొమ్మై స్వయంగా సమీక్షించారు. రాజ్ కుమార్‌కి చికిత్స అందిస్తున్న విక్రమ్ ఆస్పత్రికి వెళ్లి సీఎం వైద్యులతో మాట్లాడారు. రాజ్ కుమార్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఫ్యాన్స్ వేలాదిగా ఆస్పత్రికి తరలి వస్తుండడంతో పునీత్ ఆరోగ్యంపై సీఎం కొద్దిసేపట్లో ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com