Gautami: సీనియర్ నటి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన ఐటీ..

Gautami (tv5news.in)
Gautami: నటీనటుల సంపాదనను బట్టి వారికి ఎన్నో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అందుకే వారిపై ఐటీ సోదాలు లాంటివి తరచుగా జరుగుతూనే ఉంటాయి. అందరూ నటీనటులు దీనికి బాధితులు కాకపోయినా.. కొందరు మాత్రం వారి కెరీర్‌లో ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కునే ఉంటారు. తాజాగా ఓ సీనియర్ నటి కూడా ఆదాయపు పన్ను విషయంలో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
గౌతమి.. ఒకప్పటి యూత్‌లో చాలామందికి తను ఫేవరెట్ హీరోయిన్. ఈ నటికి శ్రీపెరంబదూరు సమీపంలో కొంత వ్యవసాయ పొలం ఉంది. దాన్ని కొంతకాలం క్రితం తాను విక్రయించింది. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను విషయంలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఏర్పడ్డాయి. అందుకు ఐటీ వాళ్లు గౌతమి బ్యాంకు ఖాతాలన్నీ సీజ్ చేశారు. దీంతో గౌతమి హైకోర్టును ఆశ్రయించింది.
గౌతమి వ్యవసాయ పొలాన్ని రూ. 4 కోట్ల 10 లక్షలకు విక్రయించిందని, కానీ ఐటీ వారు మాత్రం రూ. 11 కోట్ల 11 లక్షలు అని చూపిస్తున్నారని తన తరఫు న్యాయవాది వాదించారు. దీంతో గౌతమికి హైకోర్టు ఊరటను ఇచ్చింది. మూలధనంలో 25 శాతం చెల్లిస్తే.. సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను మళ్లీ మామూలుగా వదిలేస్తామని హైకోర్టు తీర్పునిచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com