Balayya Daku Maharaj : డాకూ మహరాజ్ విధ్వంసం తప్పదా

ఈ మధ్య వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ విజయాలతోనే గాడ్ ఆఫ్ మాసెస్ అయ్యాడు. అయితే ప్రస్తుతం ఆయన నటించిన డాకూ మహరాజ్ సంక్రాంతి బరిలో ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఈ మూవీపై ముందు నుంచీ భారీ అంచనాలున్నాయి. తాజాగా వచ్చిన ట్రైలర్ తో ఆ అంచనాలను డబుల్ చేశాడు దర్శకుడు బాబీ. బాక్సాఫీస్ పై డాకూ మహరాజ్ దండయాత్ర తప్పదు అనేలా కట్ చేశారీ ట్రైలర్. ప్రతి ఫ్రేమ్ ను మాస్ కోసమే రూపొందించారా అన్నట్టుగా ఉంది ట్రైలర్. సీతారాం, నానాజీ, మైఖేల్ జాక్సన్ అంటూ డిఫరెంట్ నేమ్స్ తో బాలయ్య చేసిన హంగామాకు అభిమానుల మతిపోయింది. అఫ్ కోర్స్ మైఖేల్ జాక్సన్ అనేది సరదాగానే చెప్పి ఉంటాడు అనుకోవచ్చు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్య మరోసారి డ్యూయొల్ రోల్ లో దుమ్మురేపబోతున్నాడు అనేది ఖాయమైంది.
కొన్నాళ్లుగా బాలయ్య సాధించిన విజయాలు చూస్తే.. ఈ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంది. బలమైన క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. డాకూ మహరాజ్ లోనూ అది కంటిన్యూ కాబోతోంది అనిపిస్తోంది. ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలు సినిమాకు కీలకంగా కనిపిస్తున్నాయి. చాందిని చౌదరి సైతం ఇంపాక్ట్ ఉండే పాత్రే చేసినట్టు తెలుస్తోంది. ఇక ఊర్వశి రౌతేలా పాటపై కొన్ని విమర్శలు వచ్చినా.. సినిమాలతో తన క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది అంటున్నారు. చిన్న పాప చుట్టూ ఒక డ్యూయొల్ రోల్ లోని ఒక పాత్ర కనిపిస్తుంది. ఆ పాప ఎవరు.. ఆమెను ఎందుకు ఈ నానాజీ కాపాడుతున్నాడు అనేది ఫ్లాష్ బ్యాక్ కు లీడ్ గా చూడాలి.
ఇక ఇప్పటికే సినిమాను చూసిన వాళ్లు ఎన్ని ఎక్స్ పెక్టేషన్స్ అయినా పెంచుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ గురించి అదే పనిగా చెబుతున్నారు. ఏదేమైనా ఈ మూవీపై ముందు నుంచీ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. బాబీ చివరగా మెగాస్టార్ తో చేసిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్. పైగా వింటేజ్ మెగాస్టార్ ను చూపించాడు అనే ప్రశంసలు అందుకున్నాడు. అవి ఈ మూవీకి ఇంకా ఎక్కువ పాజిటివ్ గా మారాయి. సో.. అత్యంత భారీ అంచనాలతో రాబోతోన్న డాకూ మహరాజ్ బాక్సాఫీస్ ను దోచుకుంటాడని ఖచ్చితంగా చెబుతున్నారు. మరి సంక్రాంతి స్టార్ అయిన బాలయ్య అది సాధిస్తే ఆశ్చర్యం ఏముందీ..?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com