Venkatesh : వెంకటేష్ కెరీర్ లోనే హయ్యొస్ట్ ఓపెనింగ్స్

సంక్రాంతికి వస్తున్నాం.. ఈ టైటిల్ చాలామందికి ముందు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ సంక్రాంతి టైమ్ లో ఎలాంటి మూవీస్ ను ఆడియన్స్ ఇష్టపడతారో.. అలాంటి కంటెంట్ తోనే రూపొందింది కాబట్టే మెల్లగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా పాటలు పెద్ద హిట్ కావడం సినిమా కలర్ నే మార్చాయి. మామూలుగా పాటలు హిట్ అయితే.. సినిమా సగం హిట్ అంటారు కదా. అది మరోసారి సంక్రాంతికి వస్తున్నాం విషయంలో ప్రూవ్ అయింది. ఆల్రెడీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ కు బ్లాక్ బస్టర్ అన్న టాక్ ఉంది. దానికి హ్యాట్రిక్ యాడ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఈ మూవీ ప్రమోషన్స్ లో కనిపించింది. కట్ చేస్తే అంతా ఊహించినట్టుగానే సంక్రాంతికి వస్తున్నాం.. నిజంగానే సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు.. మిగతా రెండు సినిమాలను కూడా దాటిపోయింది. సంక్రాంతి విన్నర్ గా డిక్లేర్ అయింది. అందుకు నిదర్శనమే ఫస్ట్ డే కలెక్షన్స్.
ఇప్పటి వరకు వెంకటేష్ కెరీర్ లోనే లేనంత భారీ ఓపెనింగ్స్ వచ్చాయీ మూవీకి. మొదటి రోజు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 45కోట్లు వసూలు చేసి వారెవ్వా అనిపించింది. నిజానికి ఇది వెంకీ కెరీర్ లోనే కాదు.. ఆయన తరం హీరోల్లోనే బెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్. ఈ స్థాయి వసూళ్లు మేకర్స్ కూడా ఊహించలేదు అనే చెప్పాలి. వెంకీకి ఇది భారీ విజయం అనుకోవచ్చు.
భీమ్స్ సిసిరోలియో సినిమాకు హిట్ కళను ముందే తెస్తే.. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరిల నటన, వెంకటేష్ టైమింగ్, ఫ్యామిలీ ఫెస్టివల్ కు ఫ్యామిలీ హీరోగా ఆయన సత్తా చాటడం ఊహించిందే అయినా ఈ స్థాయి వసూళ్లు మాత్రం ఎక్స్ పెక్ట్ చేయలేదెవరూ. మొత్తంగా వెంకీ తన తరం హీరోల్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుని అదరగొట్టాడు. సో.. ఈ దూకుడు కొనసాగితే ఫస్ట్ టైమ్ ఆయన కూడా 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిపోతాడని వేరే చెప్పాల్సిన పనిలేదేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com