Mohanlal : ఎల్ 2 ఎంపూరన్ ట్రైలర్ వచ్చేసింది

Mohanlal  :  ఎల్ 2 ఎంపూరన్ ట్రైలర్ వచ్చేసింది
X

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా ఎల్ 2 ఎంపూరన్. కొన్నాళ్ల క్రితం మళయాలంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన లూసీఫర్ కు ఇది సీక్వెల్. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. మామూలుగా ప్యాన్ ఇండియా రేంజ్ లో బిగ్ హిట్ కొట్టాలన్న టార్గెట్ గానే ఈ చిత్ర ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు. కొన్ని రోజుల నుంచి నాన్ స్టాప్ గా ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అన్ని భాషల్లోనూ ప్రతి రోజూ ఈ మూవీకి సంబంధించిన ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక అన్నిటికి మించిన ట్రైలర్ వచ్చేసింది.

కొన్నాళ్లు ఇండియన్ సినిమా విజువల్ గ్రాండీయర్స్ కు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఈ ట్రైలర్ చూస్తే వీళ్లూ అదే చేశారనిపిస్తోంది. లూసీఫర్ కంటెంట్ ను కంటిన్యూ చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. లూసీఫర్ లో ఫ్యామిలీ ఎమోషన్స్, పాలిటిక్స్, హీరోయిజం, డైనమిజం అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ అయి కనిపిస్తాయి. కానీ ఎందుకో ఈ సారి అవి మిస్ అయినట్టుగా అనిపిస్తోంది. అదే టైమ్ లో ఆ ఎమోషన్స్ ను ట్రైలర్ దాచారేమో అని కూడా అనుకోవచ్చు. రాజకీయాలు, అల్లర్లు, రౌడీయిజంతో అల్ల కల్లోలంగా ఉన్న కేరళను కాపాడమని స్టీఫెన్(మోహన్ లాల్)ను వేడుకుంటారు చాలామంది. కానీ అతను ఎక్కడున్నాడు అనేది ఎవరికీ తెలియదు. అది తెలుసుకునే క్రమంలో డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇంటర్నేషనల్ ఎఫైర్స్ అంటూ చాలా అంశాలే టచ్ చేశాడు దర్శకుడు. అక్కడి నుంచి కేరళకు వచ్చిన స్టీఫెన్ తన రాష్ట్రాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది పాయింట్ కావొచ్చు. ఇక ఈ పార్ట్ లో కూడా టోవినో థామస్, మంజు వారియర్ పాత్రలు కీలకంగా కనిపించబోతున్నాయనిపిస్తోంది. అభిమన్యు సింగ్ పాత్ర సినిమాలో పెద్దగానే ఉండేలా ఉంది. మ్యూజికల్ గా బావుంది. విజువల్ గ్రాండియర్ బిగ్ స్కేల్ లో ఉంది. సింపుల్ గా చెబితే ఓ స్టైలిష్ హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ మేకింగ్ లుక్ తో కనిపిస్తోంది ఎల్ 2 ఎంపూరన్.

గోకులమ్ గోపాలన్, ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రంలో ఇంద్రజిత్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్, సూరజ్ వెంజరమూడు, కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Tags

Next Story