28 Jan 2022 9:04 AM GMT

Home
 / 
సినిమా / Himaja : విడాకుల పై...

Himaja : విడాకుల పై హిమజ క్లారిటీ...!

Himaja : తెలుగు బిగ్‌‌బాస్ బ్యూటీ హిమజ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Himaja : విడాకుల పై హిమజ క్లారిటీ...!
X

Himaja : తెలుగు బిగ్‌‌బాస్ బ్యూటీ హిమజ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హిమజ తన భర్తకి విడాకులు ఇవ్వబోతుందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిపైన హిమజ స్పందించింది. ఇన్‌‌స్టా‌‌గ్రామ్‌‌ వేదికగా ఓ వీడియోలో హిమాజ మాట్లాడుతూ.. 'ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, విడాకులు చేసేస్తున్నారు. సాధారణంగా నేను ఇవన్ని పట్టించుకోను.. కానీ మా పేరెంట్స్‌ కాస్త సెన్సిటివ్.. ఇలాంటివి తెలిస్తే బాధపడుతారు. ఇలాంటి ఫేక్ వార్తలు క్రియేట్ చేయకండి. పెళిళ్లు నాకు సెట్‌ కావు ప్రస్తుతం సింగిల్‌గా హ్యాపీగా ఉంటూ మా ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటున్నా. సింగిల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాను. 3-4ఏళ్లలో తప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంది. ఒకవేళ చేసుకుంటే చాలా గ్రాండ్‌గా అందరికి చెప్పి చేసుకుంటాను.. అలాగే నా పెళ్లి, విడాకులకు నన్ను కూడా పిలవండి' అంటూ వ్యంగంగా స్పందించింది" కాగా నేను శైలజ, వరుడు కావలెను మొదలగు సినిమాలో నటించిన హిమజ.. తెలుగు బిగ్‌‌బాస్ షోతో ఫుల్ పాపులర్ అయింది.

Next Story