సినిమా

Himaja : పారపట్టి మట్టి ఎత్తి.. కూలీగా మారిన హిమజ..!

Himaja : బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సీరియల్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌‌లో దూసుకుపోతోంది.

Himaja : పారపట్టి మట్టి ఎత్తి.. కూలీగా మారిన హిమజ..!
X

Himaja : బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సీరియల్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌‌లో దూసుకుపోతోంది. బిగ్‌‌‌బాస్ షో ఆమెకి మరింత క్రేజ్‌‌ని తీసుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా హిమజ మంచి యాక్టివ్‌‌‌గా ఉంటోంది. సినిమా విషయాలను, వ్యక్తిగత విషయాలను అందులో పంచుకుంటుంది. తాజాగా తన డ్రీమ్ హౌస్ గురించి వెల్లడించింది.

తన డ్రీం హౌస్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇంటిపనులను వీడియోగా తీసి యూట్యుబ్‌‌లో పోస్ట్ చేసింది హిమజ. ఈ వీడియోకి "నా డ్రీం నిజమవ్వబోతుంది.. నా డ్రీం హౌస్ కట్టుకుంటున్నాను. మీ ఆశీర్వాదాలు కావాలి నాకు. మీ సపోర్ట్ లేకుండా నేను ఇది సాధించలేను." అంటూ పోస్ట్ చేసింది. నాలుగంతస్తుల ఈ ఇంటి నిర్మాణంలో మోడ్రన్‌ లిఫ్ట్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా హిమజ వెల్లడించింది.

కాగా తన ఇంటినిర్మాణం కోసం హిమజ కూలీగా కూడా మారింది. పారపట్టి మట్టి ఎత్తి పోసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక హిమజ గతంలోనే ఓ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసింది. అయితే అది దానిని తన తల్లి సహకారంతో కొనుగోలు చేశానని చెప్పుకొచ్చింది.Next Story

RELATED STORIES