Suhasini : హిందీ భాష పై సుహాసిని.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్..!

Suhasini :  హిందీ భాష పై సుహాసిని.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్..!
Suhasini : కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ స్టార్‌ అజయ్ దేవగణ్ మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది.

Suhasini : దేశంలో హిందీ భాషా వివాదం ఇప్పట్లో సద్దుమనిగేలా కన్పించట్లేదు. కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ స్టార్‌ అజయ్ దేవగణ్ మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా హిందీ భాషా వివాదంపై సీనియర్ నటి సుహాసిని వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. హిందీ వివాదంపై స్పందించిన ఆమె... నటులు అన్న తర్వాత అన్ని భాషలు నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. హిందీ భాష అనేది మంచి లాంగ్వేజ్ అని.. అది కూడా నేర్చుకోవడం ముఖ్యమన్నారు. అక్కడితో ఆగకుండా హిందీ మాట్లాడే వాళ్ళు మంచి వాళ్లు అని.. వాళ్లతో మాట్లాడాలంటే మనం కూడా హిందీ నేర్చుకోవాల్సిందేనన్నారు.

తమిళ్‌ వాళ్లు కూడా మంచివాళ్లేనని.. అయితే హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషం అని సుహాసిని అన్నారు. తమ ఇంట్లో పని చేసే వాళ్లలో కొంతమంది తెలుగు మాట్లాడతారని, కొంతమంది హిందీ మాట్లాడతారని.. తనకు ఆ భాషే కావాలి.. ఈ భాషే కావాలంటే తిండి దొరకదన్నారు. అందుకే అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలన్నారు. అయితే నటి సుహాసిని వ్యాఖ్యలపై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సుహాసినిని ట్రోల్ చేస్తున్నారు. హిందీ భాషపై అంత మక్కువుంటే అక్కడికే వెళ్లి... బాలీవుడ్ చేసుకోమంటూ ఫైర్ అవుతున్నారు.

అటు అజయ్ దేవగన్, సుదీప్ మధ్య కొనసాగుతున్న జాతీయ భాషా వివాదంపై ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ సైతం స్పందించారు. హిందీ మన జాతీయ భాష అని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదన్నారు. అది ఎక్కువగా మాట్లాడే భాష కావచ్చు... కానీ జాతీయ భాష కాదన్నారు. నిజానికి ప్రపంచంలోనే తమిళం చాలా పురాతన భాష అనే చర్చ జరుగుతోందన్నారు. ఇక ఇతర దేశాలతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలే చాలా ఉన్నాయని, దేశంలో కొత్త సమస్య సృష్టించొద్దంటూ సూచన చేశారు సోనూ నిగమ్.

Tags

Read MoreRead Less
Next Story