HIT 3 : బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న నాని

HIT 3 :  బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న నాని
X

నేచురల్ స్టార్ నుంచి వయొలెంట్ స్టార్ గా మారాడు నాని. హిట్ 3 చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇదే చెబుతున్నారు. అతని ఇమేజ్ ను పూర్తిగా వదిలేసి చేసిన సినిమా ఇది. హిట్ మూవీ ఫ్రాంఛైజీలో వచ్చిన హిట్ 3 మిగతా రెండు సినిమాల కంటే కమర్షియల్ గా స్ట్రాంగ్ అవుతోంది. ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ తో నాని కెరీర్ బెస్ట్ గా నిలిచింది. సెకండ్ డే కాస్త తగ్గినా స్ట్రాంగ్ గానే ఉంది. ఇక ఈ శని, ఆదివారాల్లో ఫస్ట్ డే ను మించిన వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేషన్, సెకండ్ హాఫ్ యాక్షన్ తో వెండితెరను రక్తపాతంలో ముంచెత్తాడు నాని.

శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ థర్డ్ కేస్ ను ఛేదించంలో అతను సూపర్ సక్సెస్ అయ్యాడు. కొన్ని హాలీవుడ్ మూవీస్ తో పాటు, వెబ్ సిరీస్ ల రిఫరెన్స్ లు కనిపించినా.. కంటెంట్ బలంగా ఉండటంతో ఆడియన్స్ అవన్నీ మర్చిపోయారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాత్రకూ మంచి ప్రాధాన్యం ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ తో లౌడ్ గా కాక మూడ్ ను ఎలివేట్ చేసే మ్యూజిక్ చేయించుకున్నారు. అదీ బానే వర్కవుట్ అయింది.

తెలుగు స్టేట్స్ తో పాటు ఓవర్శీస్ లో కూడా హిట్ 3 రాంపేజ్ కొనసాగుతూనే ఉంది. మరి ఈ మూవీతో నాని కెరీర్ బెస్ట్ వసూళ్లు కూడా అందుకోవచ్చనే అంచనాలున్నాయి.

Tags

Next Story